S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/30/2018 - 02:56

హైదరాబాద్/చార్మినార్, మార్చి 29: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణకు అనుకూలంగా అంతే వేగంగా వౌలిక వసతులను మెరుగుపరుస్తామని, అందుకే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చాయమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు.

03/30/2018 - 01:52

విశాఖపట్నం, మార్చి 29: దేశంలోని వివిధ బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఐడీబీఐకి చెందిన మూడు శాఖల్లో సుమారు 680 కోట్ల రూపాయల కుంభకోణాన్ని విశాఖ సీబీఐ అధికారులు బయటపెట్టారు. దీనికి సంబంధించి సీబీఐ విడుదల గురువారం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐడీబీఐ బ్యాంకుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుంది.

03/30/2018 - 01:51

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 29: అవినీతి, అక్రమాలు, దోపిడీ విధానాల ద్వారా పాలనా వ్యవస్థను, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చి గవర్నర్ వ్యవస్థను, ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ వ్యవస్థను ఇలా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు భ్రష్టుపట్టించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ ఆరోపించారు.

03/30/2018 - 02:14

విశాఖపట్నం, మార్చి 29: రాష్ట్రంలో కొన్ని పార్టీలు తనను విమర్శించమే పనిగా పెట్టుకున్నాయని, అభివృద్ధిని అదే పనిగా అడ్డుపడుతున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఈ రకమైన విమర్శలకు తాను భయపడేది లేదని, అలాగే వాటిని ఉపేక్షించేదీ లేదని ఉద్ఘాటించారు. తప్పుడు పార్టీలకు సహకరిస్తే, ఉద్యోగాలు పోతాయని ఆయన హెచ్చరించారు.

03/30/2018 - 02:07

విశాఖపట్నం (జగదాంబ), మార్చి 29: ఐటీ పరిశ్రమల రాకతో త్వరలోనే విశాఖ గ్లోబల్ ఫిన్‌టెక్ హబ్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ ఇన్నోవో సొల్యూషన్స్ సహకారంతోఫ్రాంక్లిన్ టెంపుల్‌టెన్ సంస్థ కార్యాలయాన్ని గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1947లో ప్రారంభమైన టెంపుల్‌టెన్ కంపెనీ విశాఖకు రావడం గర్వకారణమన్నారు.

03/29/2018 - 17:23

హైదరాబాద్: మెట్రో నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఎల్‌అండ్‌టి అధికారులు 1200 కోట్ల విలువైన ఆస్తులను కేసీఆర్ బినామీ కంపెనీకి బదిలీ చేశారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్‌అండ్‌టి ఆస్తులను రూ.250 కోట్లకే కేసీఆర్ కుటుంబం బినామీగా దక్కించుకుందని, దీనిపై విచారణకు ఆదేశించాలచి ఆయన డిమాండ్ చేశారు.

03/29/2018 - 17:22

హైదరాబాద్: మొక్కల పెంపకానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన గురువారంనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ..రాష్టవ్య్రాప్తంగా 250 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. మొక్కలు నాటని సర్పంచ్‌లను తొలగిస్తామని, నాటిన మొక్కలను సంరక్షించని గ్రామ కార్యదర్శిని కూడా తొలగిస్తామని ఆయన తెలిపారు.

03/29/2018 - 17:21

హైదరాబాద్: సినీనటుడు ప్రకాశ్‌రాజు ఈరోజు శాసనసభ జరుగుత్ను సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో వీరు కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాశ్‌రాజు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో కలిసి భోజనం చేశారు.

03/29/2018 - 17:21

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. గత పదమూడు రోజుల నుంచి జరుగుతున్న శాసనసభను గవర్నర్ నరసింహాన్ ప్రారంభించారు. ఈ సమావేశాల్లో 11 బిల్లులకు ఆమోదం లభించింది. గవర్నర్ ప్రసంగిస్తున్న సందర్భంగా జరిగిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయటం జరిగింది.

03/29/2018 - 12:56

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ పోలీసుల తనిఖీలు చేపట్టారు. గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో 20 తులాల బంగారం, కిలో వెండి, నగదును పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు రైలులో బంగారం, వెండి ఆభరణాలు వదిలి వెళ్లినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Pages