S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2018 - 03:40

కరీంనగర్, మార్చి 8: కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం సిగ్గుచేటని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర భారత్‌లో మహిళా మంత్రి లేని ఏకైక కేబినెట్ తెలంగాణ మాత్రమేనని విమర్శించారు. 2కోట్ల మంది మహిళల్లో ఒక్కరూ కూడా అర్హులు లేరా అని ప్రశ్నించారు.

03/09/2018 - 03:31

హైదరాబాద్, మార్చి 8: క్రీడలు, వ్యాపార రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మహిళామణులు హైదరాబాద్‌లో ఉన్నారని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతులు క్రీడల్లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు.

03/09/2018 - 03:26

హైదరాబాద్, మార్చి 8: విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడే పరికరాలను తక్కువ ఖర్చుతో రూపొందించేందుకు, అభివృద్ధి చేసేందుకు శాస్తవ్రేత్తలు మరింత కృషి చేయాలని భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ ఆర్ చిదంబరం పేర్కొన్నారు.

03/09/2018 - 03:24

హైదరాబాద్, మార్చి 8: వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పిజి) పూర్తి చేసిన విద్యార్థులు ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయాలన్న నిబంధనను తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా గురువారం ప్రకటన జారీ చేస్తూ, పిజి వైద్య విద్యార్థులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

03/09/2018 - 03:23

హైదరాబాద్, మార్చి 8: తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని బిజెపి జాతీయ నాయకుడు ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెరాస రిజర్వేషన్ల అంశం రాష్ట్రానికి ఉండాలని డిమాండ్ చేస్తోందని, రిజర్వేషన్లు అనేది చాలా సున్నితమైన అంశమని అన్నారు.

03/09/2018 - 03:22

హైదరాబాద్, మార్చి 8: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన మిని గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం సిఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ముట్టడికి రావడంతో వారందరిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా దినోత్సవం రోజు మహిళలు సిఎంను కలిసేందుకు వస్తే అడ్డుకోవడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/09/2018 - 03:19

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్ర సమన్వయ సమితి డైరెక్టర్ మరియు చైర్మన్‌గా పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గత నెల 25 న జరిగిన రైతు సమన్వయ సమితుల సమావేశంలో అనధికారికంగా ప్రకటించిన విషయం గమనార్హం.

03/09/2018 - 03:18

హైదరాబాద్, మార్చి 8: రైల్వే స్టేషన్లలో మహిళలకు అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాల్లో సత్వర చర్యలు తీసుకున్నట్లు ద.మ.రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. పలు రైల్వే స్టేషన్‌లలో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ యంత్రాలు, బేబీ ఫీడిం గ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

03/09/2018 - 03:17

హైదరాబాద్, మార్చి 8: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారాన్ని రాజ్యాంగ సవరణతో ఇవ్వవచ్చని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ బి ఎస్ రాములు పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా మాదిరి మరిన్ని వివరాలను సేకరించి ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని అన్నారు. ఎవరి జనాభా ఎంతో, ఎవరు ముందుకు సాగారో, ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలో తెలుస్తుందని పేర్కొన్నారు.

03/09/2018 - 02:52

హైదరాబాద్, మార్చి 8: టిఎస్ సెట్‌ను జూలై 15న నిర్వహించనున్నారు. దరఖాస్తులను ఈ నెల 14 నుండి వచ్చే నెల 14 వరకూ స్వీకరిస్తారు. హైదరాబాద్1500 జరిమానాతో ఏప్రిల్ 24 వరకూ, 2వేల జరిమానాతో మే 4వ తేదీ వరకూ, 3వేల జరిమానాతో మే 15వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. పరీక్ష జూలై 15న జరుగుతుంది. కాగా గత సెట్‌లో అర్హత సాధించిన వారి సర్ట్ఫికేట్లను గురువారం నాడు విసి లాంఛనంగా అందజేశారు.

Pages