S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/03/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 2: సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

01/03/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 2: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాయ మాటల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ పడ్డారని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయ మాటల మత్తులో ప్రజలను ఉంచేలా పవన్ మాట్లాడారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.

01/03/2018 - 02:54

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా యుజి, పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. ఎమ్సెట్ కన్వీనర్‌గా మరో మారు జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య నియమితులయ్యారు. టిఎస్ ఇసెట్ కన్వీనర్‌గా జెఎన్‌టియుహెచ్ యుసిఇ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ నియమితులయ్యారు.

01/03/2018 - 02:52

హైదరాబాద్, జనవరి 2: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల తెలంగాణ విద్యుత్ సంస్తల ప్రతిష్ట ఎంతో పెరిగిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రోత్సాహం, మార్గదర్వకం వల్లనే ఈ ఘనత సాధించామని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వడం ప్రారంభించడంతోనే విజయం సాధించినట్లు కాదని, దీనిని విజయవంతంగా కొనసాగించడం పెద్ద సవాల్ అని ఆయన అన్నారు.

01/03/2018 - 02:51

సికిందరాబాద్, జనవరి 2: అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని నిర్భందాలకు మాదిగలు వెనుకంజవేయకూడదని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం సికిందరాబాద్‌లోని పార్శిగుట్ట ఎమ్మార్పీస్ కేంద్ర కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగింది. మందక్రిష్ణ మాదిగ నిరాహారదీక్షకు దిగనున్నారని తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

01/03/2018 - 02:49

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో 61 కేజీబీవీలకు అకడమిక్ బ్లాక్‌లను ఈ నెల 15వ తేదీలోగా ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కెజీబీవీలు, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల్లో సౌకర్యాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య , ఇతర అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

01/03/2018 - 02:47

హైదరాబాద్, జనవరి 2: ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం తీసుకురావల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రగతిపథంలో ప్రభుత్వ ఇంటర్ విద్య పేరుతో ఇంటర్ విద్య జాక్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంటర్ బోర్డును దేశంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. ఇంటర్‌లో మార్కుల విధానం తొలగించి గ్రేడింగ్ విధానం తీసుకురావాలని చెప్పారు.

01/03/2018 - 02:44

హైదరాబాద్, జనవరి 2: టిఆర్‌ఎస్, బిజెపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు తమతో మాట్లాడుతున్నారని, వారంతా త్వరలో తమ పార్టీలో చేరనున్నారని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా తెలిపారు. మంగళవారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.

01/03/2018 - 02:44

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకం అయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను మొట్ట, మొదటిసారిగా ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం సంతకం చేసారు.

01/03/2018 - 02:19

హైదరాబాద్, జనవరి 2: భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌లో ఉన్న రేయాన్స్ ఫ్యాక్టరీ (బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-బిల్ట్) లో పనిచేస్తూ రోడ్డున పడ్డ 750 మంది కార్మికులకు ఒక నెల వేతనం ఈ నెల 9 లోగా ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన మంత్రి చందూలాల్ అదేశించారు. బిల్ట్ ఫ్యాక్టరీని మూడేళ్ల క్రితం మూసివేశారు. 32 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు.

Pages