S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/29/2017 - 04:35

చింతపల్లి, నవంబర్ 28: ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని దోపిడీ చేస్తోందని సీఎల్పీ ఉప నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

11/29/2017 - 04:35

నాగర్‌కర్నూల్, నవంబర్ 28: ఇంట్లో ఉన్న భార్యాభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యాసిడ్ పోయడంతో భర్త పరిస్థితి విషమంగా ఉండగా, భార్య తీవ్ర గాయాలకు గురైన సంఘటన నాగర్‌కర్నూల్ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చిం ది. వివరాలు ఇలా ఉన్నాయి. క్రషర్ మిషన్‌ను నడుపుతున్న సుధాకర్‌రెడ్డి అనే కాం ట్రాక్టర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.

11/29/2017 - 04:34

వరంగల్, నవంబర్ 28: విశ్వనగరంగా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ హయాంలో మంజూరైన హైదరాబాద్ మెట్రోరైలు నిర్మాణం మూడున్నర సంవత్సరాలు ఆలస్యం కావడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిచ్చితనం, మూర్ఖత్వం కారణమని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తవ్వడానికి నాలుగువేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని అన్నారు.

11/29/2017 - 04:32

గజ్వేల్, నవంబర్ 28: పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమను రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సీపీఐ పోరుబాట యాత్ర సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చేరుకోగా, అనుమతి లేదంటూ ఎస్‌ఐ కమలాకర్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.

11/29/2017 - 04:31

మెదక్, నవంబర్ 28: సమయం వచ్చినప్పుడు పార్టీని ప్రకటిస్తానని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. మంగళవారం మెదక్ రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన కొలువుల కొట్లాట సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఫిబ్రవరి నుండి కొలువుల కొట్లాటపై సదస్సు కోసం దరఖాస్తులు పెట్టుకున్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. చివరకు కోర్టు ఉత్తర్వుల మేర కు గ్రౌండ్ అనుమతి వచ్చిందన్నారు.

11/29/2017 - 04:12

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీకి బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘మోదీ, మోదీ’ అంటూ కార్యకర్తలు నినదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ 5 నిమిషాలు మాట్లాడారు.

11/29/2017 - 03:33

హైదరాబాద్, నవంబర్ 28: భరతజాతి గర్వించదగ్గ రీతిలో సంగీత నృత్య రూపకాలతో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు మంగళవారం సాయంత్రం హైటెక్స్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రారంభమైంది. హైటెక్స్‌లోని రంగుల హరివిల్లును తలపించేలా ఒక పక్క నృత్య రూపకాలు, మరో పక్క ప్రభుత్వ కార్యక్రమాల దృశ్య శ్రవణ మాధ్యమాల్లో కనువిందుగా ప్రదర్శించారు.

11/29/2017 - 03:29

హైదరాబాద్, నవంబర్ 28: పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం స్కీం దేశానికే ఆదర్శమని, ఈ పథకంతో గృహనిర్మాణ రంగంలోనే నూతన అధ్యాయనం ప్రారంభమైందని కేంద్ర గృహానిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు.

11/29/2017 - 03:28

హైదరాబాద్, నవంబర్ 28: ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులకు విందు కోసం ఏర్పాటు చేసిన ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద అతిథులు అవమానానికి గురయ్యారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో సదస్సు ముగియగానే టిఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో విదేశీ అతిథులు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బయలు దేరారు. అక్కడ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, బస్సులను ప్యాలెస్ లోనికి అనుమతివ్వలేదు.

11/29/2017 - 03:27

హైదరాబాద్, నవంబర్ 28: వైద్య, ఆరోగ్య శాఖలో 1764 పోస్టులను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం మంగళవారం అనుమతించింది. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌లో) రంగాపూర్ క్యాంపస్‌లో 873 పోస్టులను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. నిమ్స్‌లో మొదటి దశలో 425 పోస్టులను, రెండో దశలో 448 పోస్టులను భర్తీ చేసుకోవాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Pages