S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/01/2017 - 04:28

హైదరాబాద్, నవంబర్ 30: పదిహేనేళ్ల బాలిక తనకు నోబెల్ బహుమతి గ్రహీత కావాలని ఉంది అంటే అందరూ ముక్కున వేలేసుకుని ఆశ్చర్యంగా చూశారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో అజర్‌బైజన్ నుండి వచ్చిన బాలిక రేయన్ తన ఆలోచనలతోనే కాదు, వాస్తవికంగా తాను కృషి చేసి సత్తా ప్రదర్ళించింది. జీఈఎస్‌లో పాల్గొంటున్న అతి పిన్నవయస్కురాలైన బాలిక ఆమె.

12/01/2017 - 04:27

హైదరాబాద్, నవంబర్ 30: పారిశ్రామిక ఔత్సాహికత అనేది చిన్నతనంలోనే మొదలు కావాలనిగ అమెరికా కార్మిక శాఖ, మహిళా విభాగం డైరెక్టర్ పాట్రీసియా జి గ్రీన్ పేర్కొన్నారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధమిక స్థాయి నుండే ఔత్సాహికతను ప్రోత్సహించే పాఠ్యాంశాలను ప్రణాళికలో చేర్చడంతో పాటు తోడ్పాటు ఇవ్వాలని, పిల్లల ఆలోచనలను మెరుగుపరచాలని చెప్పారు.

12/01/2017 - 04:25

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు అనేక మందికి గొప్ప అవకాశాలను సృష్టించింది. ఏరిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధి వి రమణ కుమార్ కేష్-ఇ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యంత భద్రతంగా, పారదర్శక పద్ధతిలో నగదు బదిలీకి ఈ యాప్ ఉపయోగపడుతుందని రమణకుమార్ పేరొచ్కన్నారు.

12/01/2017 - 04:19

కేతేపల్లి, నవంబర్ 30: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత సంక్షేమ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజె క్టు మూసీలో గురువారం కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, శాసనసభ్యుడు వేముల వీరేశంతో కలిసి 19 లక్షల చేపపిల్లలను ప్రాజెక్టులో వదిలారు.

12/01/2017 - 04:18

మహబూబ్‌నగర్, నవంబర్ 30: డిసెంబర్ 4న తలపెట్టిన కొలువులపై కొట్లాట సభ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పెద్ద యుద ధమేనని టీజేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. కొలువులపై కొట్లాట సభ నిర్వహణలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సన్నాహక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.

12/01/2017 - 03:15

హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో 1.25 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారని, వాటి కోసం 218 కోట్ల రూపాయిలు ఏటా ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక మోడల్ స్కూళ్లను ఎత్తివేసిందని, అయితే ఇక్కడ పేద విద్యార్ధులు చదువుతున్నారనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఏటా 218 కోట్లను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.

12/01/2017 - 03:13

హైదరాబాద్, నవంబర్ 30: హెచ్‌ఐవి/ఎయిడ్స్ కేసుల విషయంలో హైదరాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలవగా, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా చివరిస్థానం పొందింది. 2017 ఏప్రిల్ ఒకటి నుండి అక్టోబర్ చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,44,116 మందికి హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించగా, 6,948 మంది ఈ వ్యాధి సోకినట్టు తేలింది.

12/01/2017 - 03:12

హైదరాబాద్, నవంబర్ 30: నగరంలోని అమీర్‌పేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల అత్యుత్సాహంతో గురువారం ఉదయం కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెట్రోరైలులో ప్రయాణించే వారు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ మోటార్ సైకిళ్లను పార్క్ చేశారు. మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్‌కు అనుమతి లేదంటూ ట్రాఫిక్ పోలీసులు బైక్‌లను వాహనాల్లో తీసుకెళ్లారు.

12/01/2017 - 03:12

హైదరాబాద్, నవంబర్ 30: టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును పబ్లిక్ సర్వీసు కమిషన్ డిసెంబర్ 15 వరకూ పొడిగించింది. 31 జిల్లాలకు అనుగుణంగా కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికగానే పోస్టుల భర్తీ జరగాలని హైకోర్టు ఆదేశించిన మేరకు కొత్త నోటిఫికేషన్‌ను సర్వీసు కమిషన్ విడుదలచేస్తోంది.

12/01/2017 - 03:11

హైదరాబాద్, నవంబర్ 30: బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్దరు బ్యాంక్ అధికారులతో సహా ఐదుగురికి సీబీఐ కోర్టు జైలుశిక్షతోపాటు రూ. 4.95 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

Pages