S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2017 - 02:15

హైదరాబాద్, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీకి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే ఎందుకు గుర్తు రాలేదని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మంగళవారం విచ్చేసిన ప్రధాని మోదీ బిజెపి కార్యకర్తల సభలో ప్రసంగిస్తూ హైదరాబాద్‌కు రాగానే తనకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తు వస్తారని అన్నారని విహెచ్ బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

11/30/2017 - 02:14

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చారిత్రాత్మక రామప్పదేవాలయం పరిరక్షణకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రామప్ప దేవాలయం తూర్పు వైపు గోడ దెబ్బతిందని, దీనికి వెంటనే మరమ్మత్తులు చేపడుతామని హైకోర్టుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోర్టుకు తెలిపింది.

11/30/2017 - 02:14

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణలో గత నాలుగు నెలల్లో 684 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధి బారినపడ్డారు. 2017 ఆగస్టు 1 నుండి నవంబర్ 28 వరకు 6392 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో దాదాపు 10 శాతం మంది స్వైన్‌ఫ్లూకు గురైనట్టు తేలింది. ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉందని, స్వైన్‌ఫ్లూకు కారణమైన వైరస్ ఈ పరిస్థితిలో పెరిగే అవకాశం ఉందన్నారు.

11/30/2017 - 02:14

హైదరాబాద్, నవంబర్ 29: మెదక్ జిల్లా నారాయణఖేడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండలి సభ్యుల గడువు పొడగించారు. ఈ పాలక మండళ్ల గడువు ఈ నెలతో పూర్తవుతోంది. దాంతో మరో ఆరునెలల పాటు వీరిగడువు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

11/30/2017 - 02:13

సిద్దిపేట, నవంబర్ 29 : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కారిస్తానని హామీనిచ్చి.. అమలు చేయటంలో నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ అన్నారు. రేషన్ డీలర్లకు కమీషన్ రద్దు చేసి..వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

11/30/2017 - 02:13

హైదరాబాద్, నవంబర్ 29: మెట్రో రైలు ధరలు తగ్గించాల్సిందే, ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందే..అని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిక్కెట్టు ధరలు తగ్గించకపోతే ప్రజాఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

11/30/2017 - 02:11

హైదరాబాద్, నవంబర్ 29: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని సికింద్రాబాద్‌లోని బైసన్‌పొలో గ్రౌండ్‌కు తరలింపు అవసరమా? అనే అంశంపై వచ్చే నెల 1న (శుక్రవారం) అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నగరంలోని సోమాజీగుడాలో గల ప్రెస్ క్లబ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

11/30/2017 - 02:11

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ జైళ్లశాఖ చేపట్టిన వివిధ వినూత్న సంస్కరణల్లో భాగంగా ఖైదీలలో మార్పు తీసుకురావడం, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళా ఖైదీలకూ జీవనోపాధి వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తోంది.

11/30/2017 - 02:10

హైదరాబాద్, నవంబర్ 29: గ్యాంగ్‌స్టర్ నరుూం ఆస్తులపై ఐటీ శాఖ నిఘా వేసింది. అతని కుటుంబ సభ్యులకు ఐటీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల వివరాలు ఇవ్వాల్సిందేనని ఐటీ అధికారులు భువనగిరిలోని నరుూం కుటుంబ సభ్యులకు తాఖీదులు జారీ చేశారు. బినామీ ఆస్తుల లావాదేవీలపై ఎనిమిది మంది పేర్లతో యాదాద్రి భువనగిరి జిల్లా (నల్గొండ) భువనగిరిలోని నరుూం ఇంటికి నోటీసులు అంటించారు.

11/29/2017 - 04:35

ఆదిలాబాద్,నవంబర్ 28: ఆదిలాబాద్ జిల్లాలో చలిపంజా విసరడంతో సామాన్య జనజీవనం స్థంభించిపోతోంది. వాతావరణ మార్పుల ప్రభావంగా ఈ జిల్లాలో ఏడాదికి మూడు కాలాలు విభిన్నమైన పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల ప్రభావానికి తోడు దట్టమైన అడవుల ప్రభావంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను మంచు దుప్పటి కమ్మేసి కనిష్ట ఉష్ణోగ్రతలతో వణికిస్తోంది.

Pages