S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/08/2017 - 03:03

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మన దేశంలో కన్నా విదేశాల్లో చేనేత బట్టలకు డిమాండ్ ఎక్కువగా ఉందని సినిమా హీరోయిన్, చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ సమంత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే చేనేతకు గుర్తింపు వచ్చిందని అన్నారు. మంత్రి కెటిఆర్ నాయకత్వంలో చేనేతకు మంచి గుర్తింపు లభించినట్టు చెప్పారు. చేనేత వస్త్రాల తయారీ, ప్రచారాన్ని కెటిఆర్ చాలెంజ్‌గా తీసుకున్నారని అన్నారు.

09/08/2017 - 02:30

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మహోజ్వలంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. చారిత్రక పోరాటాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రావి నారాయణరెడ్డి 26వ వర్థంతి సందర్భంగా గురువారం తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో వర్థంతి సభ జరిగింది.

09/08/2017 - 02:28

హైదరాబాద్, సెప్టెంబర్ 7: వర్షాభావ పరిస్థితుల వల్ల చిన్న నీటి వనరులు చెరువులు, కుంటల్లోకి తగినంత నీరు చేరకపోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. మిషన్ కాకతీయ వల్ల చెరువుల పునరుద్ధరణ జరిగినప్పటికీ సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో వీటి కిందనున్న ఆయకట్టులో పాతిక భాగానికైనా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు.

09/08/2017 - 02:27

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గాలికొదిలి మీ మూఢనమ్మకం కోసం కొత్త సచివాలయం నిర్మిస్తారా అంటూ సిఎం కెసిఆర్‌పై టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నప్పుడు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకురావడం ద్వారా వారి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

09/08/2017 - 02:25

హైదరాబాద్, సెప్టెంబర్ 7: సికింద్రాబాద్ బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయానికి బదులు బహుళ క్రీడా సముదాయం నిర్మించాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి.హనుమంతరావు సిఎం కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న సచివాలయంలో అన్ని హంగులు ఉన్నాయని, అనవసరంగా ప్రజాధనం వృధా చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.

09/08/2017 - 02:19

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఉపాధ్యాయులపై నాలుగు రకాల బాధ్యతలు ఉంటాయని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మేకల పద్మావతి పేర్కొన్నారు. యాదాద్రిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (బయోసైనె్సస్) గా పనిచేస్తున్న పద్మావతి ఉత్తమ ఉపాధ్యాయురాలగా ప్రభుత్వం చేత ఎంపికయ్యారు.

09/07/2017 - 23:13

వనపర్తి, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం రాకముందు ఒకరకంగా, అధికారం వచ్చాక మరో రకంగా మాట్లాడుతూ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

09/07/2017 - 23:12

పరకాల, సెప్టెంబర్ 7: వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని, లేకుంటే పరకాల పాత తాలుకా మండలాలతో కలిసి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అమర వీరుల మైదాన భవనంలో మొగుళ్ళపల్లి, రేగొండ, చిట్యాల మండలాల అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించారు.

09/07/2017 - 23:12

భీమదేవరపల్లి, సెప్టెంబరు 7: వరంగల్ రూరల్ జిల్లా భీమదేవ రపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి సన్నిధిలో గురువారం ఘనం గా ఘటాభిషేకం వేడుకులను నిర్వహించారు. వీరభద్రుని సన్నిధిలో తొలుత ఆలయ అర్చకులు గణపతిపూజ జరిపారు. పుణ్యాహవచనం, స్వామివారికి మహాలింగార్చన శాస్త్ర యుక్తంగా అర్చకులు నిర్వహించారు. సకాలంలో వర్షా లు కురిసి రైతులు, ప్రజలు సుఖ శాం తులతో ఉండాలని వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజ లు చేశారు.

09/07/2017 - 23:11

అనంతగిరి, సెప్టెంబర్ 7: నీటి బకెట్‌లో పడి ఒక చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా అనం తగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం... ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కొండాపురం గ్రామానికి చెందిన దొంతగాని ధశరద, ప్రియాంకల కూతురు జ్యోతిఅశ్విని (2) వారం రోజుల క్రితం ఖానాపురం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.

Pages