S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/05/2017 - 02:42

హైదరాబాద్, సెప్టెంబర్ 4: దళితులు, గిరిజనులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో దళితులు, గిరిజనులపై నిరంతరం దాడులు, వేధింపులు, అక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.

09/05/2017 - 02:42

హైదరాబాద్, సెప్టెంబర్ 4: టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. టిఆర్‌ఎస్, బిజెపి అగ్ర నాయకత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండగా, రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టిఆర్‌ఎస్ ఎంఐఎం చెప్పు చేతుల్లో ఉందని బిజెపి నాయకులు విమర్శిస్తుండగా, ఎంఐఎం పేరుతో రాష్ట్రంలో మత కలహాలు జరపాలని బిజెపి ప్రయత్నిస్తోందని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.

09/05/2017 - 02:41

హైదరాబాద్, సెప్టెంబర్ 4:తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి పడుతుందని టిఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు వేరువేరుగా జరిగిన విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఢిల్లీ దృష్టిలో పడాలని బిజెపి నాయకులు గల్లీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

09/05/2017 - 02:40

హైదరాబాద్, సెప్టెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రైతు సమన్వయ సమితిల ఏర్పాటు యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. ఈ నెల తొమ్మిది వరకు వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు తదితర వౌలిక అవసరాల కొనుగోలు కోసం ఒక్కో రైతుకు ఎకరాకు 2018-19 సంవత్సరం నుండి నాలుగువేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

09/05/2017 - 02:39

హైదరాబాద్, సెప్టెంబర్ 4: కావేరీ పుష్కరాలు ఈ నెల 12 నుండి 23 వరకు నిర్వహిస్తున్నారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రధానమైన నదిగా కావేరీని పరిగణిస్తున్నారు. కావేరీ నదీజలాలపై కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నప్పటికీ, వివాదాలకు అతీతంగా పుష్కరాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

09/05/2017 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) ఇన్‌ఛార్జీగా బాధ్యతలు స్వీకరించిన ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా పార్టీని మరింత బలోపేతానికి నడుం బిగించారు. ఇందులో భాగంగానే ఈ నెల 9న నగర శివారులోని కొంపల్లిలోని ఎఎంఆర్ గార్డెన్స్‌లో పార్టీ ప్రజాప్రతినిధులకు, పార్టీ ముఖ్య నాయకులకు ఒక రోజు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

09/05/2017 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణలో వచ్చే 24గంటల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకటించింది. చత్తీస్‌గఢ్ నుండి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయని వెల్లడించారు.

09/05/2017 - 02:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కంటి శస్త్ర చికిత్స కోసం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఆరోతేదీన ఆయనకు శస్త్ర చికిత్స జరుగుతుంది. చంద్రశేఖరరావుసెప్టెంబర్ ఒకటో తేదీ ఢిల్లీకి వచ్చారు.

09/05/2017 - 02:12

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రయాణికుల భద్రత, రైల్వే సమయ పాలనపై సోమవారం దక్షిణ మధ్య రైల్వే సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్ల మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

09/05/2017 - 02:09

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రభుత్వం దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి కోసం ఈ నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే కరీంనగర్ జిల్లా బెజ్జంకి చెందిన మాంకాళి శ్రీనివాస్, యాలల పరశురామ్ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిందని అన్నారు.

Pages