S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/06/2017 - 02:00

హైదరాబాద్, సెప్టెంబర్ 5: భారతదేశంలో విద్యుత్ రంగంలో ఉత్పత్తి, పంపిణీ స్థాయి విపరీతంగా పెరిగిందని, మంచి అభివృద్ధి చోటు చేసుకుందని తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య, షెల్ లూబ్రికెంట్స్, గోడ్రేజ్ జిబిసి సంస్ధలు ఇంధన సామర్ధ్యంపై సదస్సును నిర్వహించాయి. ఇంధన పొదుపుపై దేశంలో ప్రజలకు, సంస్ధలకు అవగాహన పెరిగిందన్నారు.

09/06/2017 - 01:59

హైదరాబాద్, సెప్టెంబర్ 5: వర్షాభావ పరిస్థితుల వల్ల చిన్న నీటి వనరులు చెరువులు, కుంటల్లోకి తగినంత నీరు చేరకపోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. మిషన్ కాకతీయ వల్ల చెరువుల పునరుద్ధరణ జరిగినప్పటికీ సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో వీటి కిందనున్న ఆయకట్టులో పాతిక భాగానికైనా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు.

09/06/2017 - 01:57

హైదరాబాద్, సెప్టెంబర్ 5:రాష్ట్రంలోని రెండు రహదారులకు జాతీయ రహదారుల పథకం కింద కేంద్రం ఆమోదం తెలిపింది. రెండువందల కిలో మీటర్ల నిడివిగల రెండు రాష్ట్ర రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఈ రెండు జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 690కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది.

09/05/2017 - 03:01

మిర్యాలగూడ, సెప్టెంబర్ 4: కార్మికులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నూకల వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నల్లగొండ రీజియన్ ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

09/05/2017 - 03:00

జనగామ టౌన్, సెప్టెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ నయా నిజాంపాలన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల కిందట హైదరాబాద్‌లో ప్రారంభమైన తెలంగాణ విమోచన యాత్ర వివిధ ప్రాంతాల్లో పర్యటించి సోమవారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

09/05/2017 - 02:57

భువనగిరి, సెప్టెంబర్ 4: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో వీసం వెంకటరెడ్డి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి (49) సజీవ దహనంకాగా పేలుడు ధాటికి నివాసానికి ఆనుకుని ఉన్న ఇంటిలో వెంకట్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి (44) గోడకూలి మృతి చెందిన సంఘటన సంచలనం సృష్టించింది.

09/05/2017 - 02:54

సూర్యాపేట, సెప్టెంబర్ 4: తమను పెళ్లాడి తమను, తమ పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సహజీవనం సాగిస్తున్న తమ భర్తతో తాము కలిసి ఉండేలా చేసి తమకు న్యాయం చేయాలని, అలాకాకుండా తమ కుటుంబ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న భార్యలు స్వరూప, శ్రీలత అన్నారు.

09/05/2017 - 02:53

నర్సాపూర్, సెప్టెంబర్ 4: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

09/05/2017 - 02:45

హైదరాబాద్, సెప్టెంబర్ 4: దేశంలో సివిల్ సర్వీసు అధికారులతో జాతీయ సమైక్యత ఇనుమడిస్తుందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎఐఎస్-సిసిఎస్ అధికారులకు 92వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభ సందర్భంగా భారత ఉప రాష్టప్రతి ప్రసంగించారు. దేశానికి సేవ చేయడంలో అత్యంత ఆసక్తికరమైన, సవాలు ఎదుర్కొనే అవకాశాలు ఈ వృత్తిలో లభిస్తాయని ఉప రాష్టప్రతి అన్నారు.

09/05/2017 - 02:43

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఇటీవల మాదాపూర్‌లోని డంపింగ్ యార్డులో జరిగిన పేలుళ్ల సంఘటన మరువక ముందే..హైదరాబాద్‌లో మరోసారి పేలుళ్లు కలకలం సృష్టించాయి. గణేశ నిమజ్జనం నేపథ్యంలో జెలిటన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. సోమవారం జరిగిన ఈ పేలుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ పేలుళ్లపై ఆధారాలు సేకరిస్తున్నట్టు సమాచారం.

Pages