S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/20/2016 - 08:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కోటిన్నర నుంచి ఐదు కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాట్ డీలర్లు, సర్వీస్ ట్యాక్స్ చెల్లింపుదారులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పరిధిలో ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అలాగే సర్వీసు పన్ను చెల్లించే వారిలో 20 లక్షల నుంచి కోటిన్నర వరకు టర్నోవర్ ఉన్న వారిని రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని కోరామన్నారు.

10/20/2016 - 08:30

హైదరాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పార్టీ కార్యవర్గాలను నియమించుకోవడంలో ఏ మాత్రం జాప్యం చేయకుండా, వెనుకబడకుండా వెంటనే డిసిసి అధ్యక్షులను నియమించాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది. బుధవారం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర సభ ముగిసిన తర్వాత టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.

10/20/2016 - 08:30

హైదరాబాద్/ చార్మినార్, అక్టోబర్ 19: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. దీనిపై న్యాయ వ్యవస్థ కూడా స్పందించడం లేదని అన్నారు. బుధవారం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ అధ్యక్షుడు జి.

10/20/2016 - 08:19

సూర్యాపేట, అక్టోబర్ 19: రోజురోజుకు పాశ్చాత్య విషసంస్కృతి పెరిగిపోతున్న నేటి యుగంలో దేశంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు ఆధ్యాత్మికతను పాఠ్యాంశాల్లో జోడించాలని కంచి పీఠాధిపతి శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామీజీ అభిలషించారు.

10/20/2016 - 08:19

భువనగిరి, అక్టోబర్ 19: నూతనంగా ఏర్పాటైన యాదాద్రి జిల్లా పేరును యాదాద్రి భువనగిరి జిల్లాగా పేరుమార్పు చేయాలంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌లకు ఆయన ఆదేశాలిచ్చారు.

10/20/2016 - 08:18

హుజూరాబాద్, అక్టోబర్ 19: ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్విభజనలో పారదర్శకత చూపలేదని, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని, కేవలం నాయకుల అభిప్రాయాలకు అనుగుణంగానే జరిగిందని టిజెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక జెఎసి ఆధ్వర్యంలో ‘జిల్లాల పునర్వ్యవస్థీకరణ - ప్రజల డిమాండ్’ అనే అంశంపై సదస్సు జరిగింది.

10/20/2016 - 08:17

హైదరాబాద్, అక్టోబర్ 19: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ప్రజలు ఇక చెత్తకు కూడా చార్జీలు చెల్లించాల్సిందే! ఇప్పటికే నగరం నుంచి చెత్తను త్వరితగతిన తరలించేందుకు పంపిణీ చేసిన సుమారు 1700 పై చిలుకు ఆటో సిబ్బందికి ప్రతి ఇంటి యజమాని నెలకు రూ. 50 అనధికారికంగా చెల్లిస్తున్నారు. ఇకపై దీన్ని అధికారికంగా వసూలు చేసుకునేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమవుతోంది.

10/20/2016 - 08:17

మహబూబ్‌నగర్, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెక్ పడింది. వ్యాపారం ఢమాల్ కావడంతో రియల్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా రెండు జిల్లాలుగా మాత్రమే ఏర్పాటు అవుతాయని ప్రభుత్వమే తమ ముసాయిదాలో వెలువరించింది. అయితే అంతకుముందు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

10/20/2016 - 08:16

హైదరాబాద్, అక్టోబర్ 19: అవకాశాలు, వసతులు కల్పిస్తే ప్రపంచంలో ఎక్కడైనా గురుకుల పాఠశాలల విద్యార్ధులు రాణిస్తారని, వారు ఎవరికీ తీసిపోరని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలలు దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నాయని, అన్ని రాష్ట్రాలూ మన గురుకులాల్లో చేస్తున్న ప్రయోగాల వైపు చూస్తున్నాయని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

10/20/2016 - 08:15

భీమదేవరపల్లి, అక్టోబర్ 19: గ్యాంగ్‌రేప్ నిందితులను ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు హసన్‌పర్తి సిఐ రవికుమార్ బుధవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ముల్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో సిఐ విలేఖరులతో చెప్పిన వివరాల ప్రకారం... భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తల్లిదండ్రులు మృతి చెందడంతో బిసి కాలనిలో నానమ్మ వద్ద ఉంటోంది.

Pages