S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/21/2016 - 03:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తెలంగాణలో విలేఖరి శ్రీశేఖర్‌ని వనస్థలిపురం పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చెయ్యడాన్ని ఆల్ ఇండియా దళిత హక్కుల సమాఖ్య ఖండించింది. శేఖర్‌పై వనస్థలిపురం ఎసీపీ చేత అక్రమ కేసులు పెట్టించి అతి దారుణంగా చిత్రహిసంలు పెట్టారని సమాఖ్య ఆరోపించింది.

10/21/2016 - 03:31

హైదరాబాద్, అక్టోబర్ 20: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో వివిధ కేటగిరిల కింద ఖాళీగా ఉన్న 113 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రిన్సిపల్ పోస్టులు ఆరు, జూనియర్ లెక్చరర్ పోస్టులు 83, లైబ్రరియన్‌లు 16, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 8 భర్తీ చేస్తారు. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

10/21/2016 - 03:30

హైదరాబాద్, అక్టోబర్ 20: మండల రెవిన్యూ అధికారి, డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను ఇక నుంచి తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్, గిర్దావర్ పేర్లతో వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా అధికారికంగా గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

10/21/2016 - 03:30

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణలో నైపుణ్య శిక్షణకు సహకారం అందించాలని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హరిందర్ సిద్దూ, ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సియాన్ కెల్లీలను నిజామాబాద్ ఎంపి కవిత కోరారు. గురువారం పార్క్ హయత్ హోటల్‌లో వారిద్దరితో కవిత సమావేశం అయ్యారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాలు, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు.

10/21/2016 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 20: దీపావళి పండగ సందర్భంగా ప్రభుత్వం నిషేధించిన విదేశీ టపాసులు అమ్మినా.. నిల్వ ఉంచిన ఫైర్ వర్క్స్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్‌ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆర్ వేణుగోపాల్ హెచ్చరించారు. బుధవారం ఫైర్‌వర్క్స్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, 81 మంది లైసెన్స్ హోల్డర్లతో ఆయన సమావేశమయ్యారు.

10/21/2016 - 03:28

హైదరాబాద్, అక్టోబర్ 20: వచ్చే నెల 26న కమ్యూనికేషన్ పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో నియామకాల కోసం గత ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేయబడి, శారీర దారుఢ్య, పరుగు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. రాత పరీక్షలు మాత్రం వచ్చే నెల 26న, మధ్యాహ్నం గం.

10/20/2016 - 08:33

హైదరాబాద్, అక్టోబర్ 19: వైకాపా నుండి టిడిపిలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ తాము ఇచ్చిన ఫిర్యాదును ఏపి శాసనసభ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని, స్పీకర్ చర్యను అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ వైకాపా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌ను వైకాపా ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి దాఖలు చేశారు.

10/20/2016 - 08:33

హైదరాబాద్, అక్టోబర్ 19: హైదరాబాద్‌కు చెందిన శాస్తవ్రేత్తకు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ అకాడమి ఆఫ్ సైనె్సస్ ఫెలోగా డాక్టర్ అభయ్ రాం బన్సాల్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సిఎస్‌ఐఆర్-ఎన్‌జిఆర్‌ఐ ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. భూగర్భశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసి జాతీయ గుర్తింపు పొందిన బన్సాల్ నేషనల్ అకాడమి ఆఫ్ సైనె్సస్‌కు సేవలు అందించనున్నారు.

10/20/2016 - 08:32

హైదాబాద్, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ముందుకు వెళ్లాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. ప్రజలు, ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేయాలని, పోలీసులకు శాంతిభద్రతలే ముఖ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

10/20/2016 - 08:31

హైదరాబాద్, అక్టోబర్ 19: జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రభుత్వం నుండి ప్రజలు మరింత ఎక్కువ సేవలు ఆశిస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లా పంచాయితీ అధికారులు (డిపిఓలు), పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

Pages