S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/01/2016 - 07:25

సంగారెడ్డి, ఆగస్టు 31: వర్షాభావ పరిస్థితులతో నెర్రెలు వారిపోతున్న మెదక్ జిల్లాలోని వ్యవసాయ భూములకు కాస్తంత ఊరటనిస్తూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మెట్ట పంటలకు ఉపరితల ఆవర్తనం పుణ్యమాని కురిసిన వర్షం మేలు చేసిందని చెప్పవచ్చు. పొరుగు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నా మెదక్ జిల్లా మాత్రం మోస్తరు వర్షాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

09/01/2016 - 07:24

కరీంనగర్, ఆగస్టు 31: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కోసం సిరిసిల్ల, గంభీరావుపేటల్లో, సిద్దిపేటలో కలుపవద్దంటూ ఇల్లంతకుంటలో బుధవారం బంద్‌లు నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కోసం కోరుట్ల, కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలంటూ హుస్నాబాద్, కోహెడ మండలాల్లో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు జరిగాయి.

09/01/2016 - 06:48

హైదరాబాద్, ఆగస్టు 31: జంట నగరాల ప్రజలు అప్పుడప్పుడే నిద్దుర లేస్తూ, దిన చర్యల్లో నిమగ్నమవుతున్నారు. వాతావరణంలో ఏదో మార్పు. మబ్బుగా ఉండడం, చల్లని గాలి వీస్తూ ఉదయం 6 గంటల నుంచే వర్షం కురవడం ప్రారంభమైంది. అలా మధ్యాహ్నం 12 గంటల వరకు కురుస్తూనే ఉన్నది. ఇటీవల ఒక ప్రాంతంలో వర్షం కురవడం, మరో ప్రాంతంలో ఎండగా ఉండడం కనిపించేది. కానీ బుధవారం కురిసిన వర్షంతో జంట నగరాలు జలమయమయ్యాయి.

09/01/2016 - 06:43

హైదరాబాద్, ఆగస్టు 31: గ్యాంగ్‌స్టర్ నరుూం బినామీలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నరుూం అక్రమ ఆస్తులు, వ్యవహారాల బినామీ బాధ్యుడు రియల్టర్ సామ సంజీవరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా బుధవారం గ్యాంగ్‌స్టర్ నరుూం మరో ప్రధాన అనుచరుడు నల్లగొండ జిల్లా వలిగొండ ఎంపిపి శ్రీరాముల నాగరాజు, అతని కొడుకు నితిన్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

09/01/2016 - 05:41

ఈడ్చికొట్టిన వానతో హైదరాబాద్ విలవిల్లాడింది. గంటలకొద్దీ కురిసిన అసాధారణ వానతో మహానగరం మునకేసింది. బుధవారం సిటీ నడినెత్తిన కురిసిన భారీ వర్షం పెను విషాదం మిగిల్చింది. పాతగోడలు కూలి నలుగురు, తెగిపడిన విద్యత్ తీగల కారణంగా ముగ్గురు బస్తీవాసులు మృత్యువాతపడ్డారు. 15 ఏళ్ల క్రితం భారీ వర్షానికి అతలాకుతలమైన హైదరాబాద్ అనుభవాలను మళ్లీ గుర్తు చేస్తూ, అంతటి వర్షం భయానక అనుభవాన్ని రుచి చూపించింది.

09/01/2016 - 05:38

మేడ్చల్, ఆగస్టు 31: మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు మంగళవారం అర్ధరాత్రి రక్తసిక్తమయ్యింది. ఘోర ప్రమాదంలో 8మంది మృత్యువాత పడ్డారు. టోల్‌గేట్ వద్ద ఆగివున్న ఒక వాహనాన్ని వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే..

09/01/2016 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 31: హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలి మృతి చెందిన కుటుంబాలకు సిఎం కెసిఆర్ రూ.2 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించారు. అసాధారణ వర్షంతో ప్రాణ నష్టం సంభవించడం పట్ల సిఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో భారీ వర్షం కురియడంతోపాటు మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తం కావాలని సిఎం ఆదేశించారు.

09/01/2016 - 05:23

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల భర్తీతో పాటు వివిధ గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి సంబంధించి బుధవారం స్పష్టత వచ్చింది. పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి సిఎం కె చంద్రశేఖరరావుతో జరిపిన భేటీలో ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు.

08/31/2016 - 17:49

హైదరాబాద్‌ : నగరంలో బుధవారం గోడ కూలి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. భారీ వర్షాలకు గోడలు కూలి రామంతాపూర్ లో నలుగురు, భోలక్‌పూర్‌లో మరో ముగ్గురు మృతిచెందారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు, ట్రాఫిక్‌ జామ్‌ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

08/31/2016 - 17:46

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌పై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మత్తయ్య క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు జడ్జి శివశంకర్‌ విచారించవద్దని స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. స్టీఫెన్‌సన్‌ లక్ష పూచీకత్తును సీపీకి సమర్పించాలని, వచ్చే నెల 30 లోపు సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

Pages