S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/02/2016 - 11:52

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్‌కు అనుచరులుగా వ్యవహరించిన శ్రీనివాస్, లక్ష్మణ్‌లను కుషాయిగూడ వద్ద జమ్మిగడ్డలో శుక్రవారం ఉదయం ‘సిట్’ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరుూం నేరాలకు సంబంధించి వీరిని ప్రశ్నిస్తున్నారు.

09/02/2016 - 11:51

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎసిబి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ‘స్టే’ మంజూరు చేసింది. ఎసిబి కోర్టు ఆదేశాలను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దీంతో ఊరట లభించినట్టయ్యింది. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది.

09/02/2016 - 11:50

హైదరాబాద్: సార్వత్రిక సమ్మె సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో ఆటోలు, ప్రైవేటు వాహనాలను జనం ఆశ్రయించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణలో ఆర్టీసీ యూనియన్లన్నీ మద్దతు ఇవ్వడంతో బస్సులు తిరగడం లేదు. చాలా బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

09/02/2016 - 06:29

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణలో దసరా నుంచి కొత్త జిల్లాలు ఉనికి లోకి రావడం అదే రోజు నుంచి విధుల నిర్వహణ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో మంత్రులు కొత్త జిల్లాలకు సన్నద్ధం అవుతున్నారు. తమ శాఖలకు సంబంధించి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటుతో సిబ్బంది సర్దుబాటుపై చర్చిస్తున్నారు.

09/02/2016 - 06:29

హైదరాబాద్, సెప్టెంబర్ 1: స్థానిక రిజర్వేషన్ల చర్చను జోనల్ వ్యవస్థకే పరిమితం చేయడం సరైంది కాదని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. స్థానిక రిజర్వేషన్లపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుపై తొందరపాటు నిర్ణయాల వల్ల తెలంగాణకు దీర్ఘకాలిక నష్టం జరిగే పరిస్థితి ఉంటుందన్నారు.

09/02/2016 - 13:38

హైదరాబాద్, సెప్టెంబర్ 1: భారీ వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరనందున తెలంగాణ ప్రజలపై పెను భారం పడనుందని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లను సంతృప్తి పరిచేందుకు ప్రాజెక్టుల డిజైన్లు మార్చడం సిగ్గుచేటన్నారు.

09/02/2016 - 06:17

సంగారెడ్డి, సెప్టెంబర్ 1: ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యం పంటను రక్షించాలన్న దృక్పథంతో సింగూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిపెట్టిన 0.35 టిఎంసిల నీరు వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఘన్‌పూర్ ఆనకట్టకు చేరుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం ఒప్పందం ప్రకారంగా నిల్వ ఉన్న నీటి నుంచి ఘన్‌పూర్ ఆనకట్టకు 0.35 టిఎంసిల నీటిని వదిలిపెట్టాల్సి ఉంది.

09/02/2016 - 06:14

వరంగల్, సెప్టెంబర్ 1: వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఏకైక భారీ పరిశ్రమ టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ వేదిక మారినట్లు తెలిసింది. టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రభుత్వానికి పెనుసవాల్‌గా మారింది.

09/02/2016 - 06:13

సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబర్ 1: తెలంగాణ సాధించుకున్నది గిరిజనుల భూములు లాక్కోవడానికేనా అని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారారయణపురం మండలం రాచకొండ గుట్టల్లో గురువారం రాచకొండ గిరిజనుల భూగోస అధ్యయన యాత్ర సభను జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించారు.

,
09/02/2016 - 06:11

కరీంనగర్/ఆదిలాబాద్/వరంగల్, సెప్టెంబర్ 1: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై జిల్లాల్లో ఆందోళనలు నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. హైదరాబాద్‌లో జెఏసి నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ ఇచ్చిన 48 గంటల బంద్‌లో భాగంగా రెండవ రోజు బంద్ సక్సెస్ అయింది.

Pages