S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/08/2016 - 17:52

నల్లగొండ: మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ నయీం చనిపోవడం ఆనందంగా ఉందని మాజీ మావోయిస్టు సాంబశివుడు తండ్రి చంద్రయ్య నల్లగొండలో సోమవారం అన్నారు. నయీం అనుచరులను కూడా పోలీసులు మట్టుబెట్టాలని...అప్పుడే దేశం బాగుపడుతుందని చంద్రయ్య చెప్పారు. 2011లో సాంబశివుడు, 2014లో ఆయన సోదరుడు రాములును నయీం గ్యాంగ్ హత్య చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

08/08/2016 - 17:43

హైదరాబాద్‌: పోలీసు కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతదేహానికి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం పంచనామా నిర్వహించారు. ఘటనా స్థలిలో నాలుగు బుల్లెట్లు గుర్తించిన పోలీసులు, శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

08/08/2016 - 17:38

హైదరాబాద్‌: తెరాసలో తెదేపా శాసనసభా పక్షం విలీన నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ తెదేపా నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

08/08/2016 - 15:03

మహబూబ్‌నగర్‌: సోమవారం ఉదయం షాద్‌నగర్‌ మిలీనియమ్‌ టౌన్‌షిప్‌ ప్రాంతంలో పోలీసులు ఓ కారును ఆపగా, అందులోని వారు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీమ్‌ మృతిచెందినట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. నయీం కదలికలపై పక్కా సమాచారం రావడంతోనే షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.

08/08/2016 - 11:26

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. మృతుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం ఉన్నట్లు తెలుస్తోంది. మిలీనియం టౌన్‌షిప్‌లో సుమారు 10 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిలో గ్రేహౌండ్స్‌ పోలీసులు.

08/08/2016 - 08:24

భీమదేవరపల్లి, ఆగస్టు 7: అనారోగ్యం బాధిస్తోంది.. రాష్టప్రతిభవన్‌లో జరిగే సన్మానానికి వెళ్లలేను అని ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, క్విట్ ఇండియా ఉద్యమ నాయకుడు పడాల చంద్రయ్య పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆయన స్వగృహంలో ఆదివారం ఆంధ్రభూమి విలేఖరితో మాట్లాడారు.

08/08/2016 - 08:23

వీణవంక, ఆగస్టు 7: రాష్ట్రంలో భారత ప్రధాని మోదీ పర్యటనతో ఒరిగిందేమీ లేదని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

08/08/2016 - 07:58

సంగారెడ్డి, ఆగస్టు 7: రాజకీయ చాతుర్యం, మాటల మంత్రం కలగలిసిన నేతలు ఒకే వేదికపై ఉంటే ఎలా ఉంటుందనేదానికి గజ్వేల్ సభ ఓ ఉదాహరణ. ఆ ఇద్దరు నేతలు ఎవరంటే - తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టినవారు ఒకరైతే... కొత్తగా రాష్ట్రాన్ని సాధించుకుని ముఖ్యమంత్రి అయినవారు మరొకరు. తమ మాటల చాతుర్యాన్ని, చతురోక్తుల్ని పండించి ఒకరిపై ఒకరు, ఎవరి శైలిలో వారు అవ్యాజమైన ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు.

08/08/2016 - 07:56

హైదరాబాద్, ఆగస్టు 7 : భగవంతుడా... మా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సజావుగా సాగేలా, విజయవంతంగా పూర్తయ్యేలా దీవించు..అందుకు తగినంత శక్తిని ఇవ్వు.. అందుకే నీ పేరుతో (సుదర్శన యజ్ఞం) యజ్ఞం చేసాం’ అంటూ మిషన్ భగీరథ వైస్-చైర్మన్ వేముల ప్రశాంతరెడ్డి కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామం పరిధిలో ఆదివారం ఆయన సుదర్శన యజ్ఞం చేశారు.

08/08/2016 - 07:53

హైదరాబాద్, ఆగస్టు 7: ప్రధాని హోదాలో తెలంగాణకు తొలిసారిగా వచ్చిన నరేంద్ర మోదీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడకు వచ్చారు.

Pages