S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/09/2016 - 04:56

హైదరాబాద్, ఆగస్టు 8: హనుమకొండలో కాళోజీ కళాకేంద్రం నిర్మాణానికి పది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 30కోట్ల రూపాయలతో హనుమకొండలో కళాభవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి ఈ నిధులు విడుదల చేశారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నా కొద్ది అవసరం అయిన నిధులు మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు.

08/09/2016 - 04:56

హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రంలో నియోజక వర్గానికి ఒక మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ను ప్రారంభించనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం తమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్రంలో మొత్తం 2142 వెటర్నరీ ఆస్పత్రులు పని చేస్తున్నాయని, వెటర్నరీ పాలిక్లినిక్ పేరు మార్చి జిల్లా స్థాయి వెటర్నరీ ఆస్పత్రులుగా మార్చే ప్రతిపాదన ఉందని మంత్రి తెలిపారు.

08/09/2016 - 04:55

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణలో జడ్జీల నియామకంపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగిన నేపథ్యంలో తాజాగా జిల్లాజడ్జీలుగా ఆరుగురిని నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు రిజిస్ట్రార్ సిఫార్సుల మేరకే ఉత్తర్వులు జారీ చేశారు.

08/09/2016 - 04:54

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం విలీనంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, విలీన నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

08/09/2016 - 04:53

భువనగిరి, ఆగస్టు 8: నరుూమోద్దీన్ ఇంటితో పాటు అతని అనుచరుల ఇండ్లలో పోలీసులు సోమవారం ముమ్మరంగా సోదాలు చేపట్టారు. నరుూం అనుచరులుగా పేరుగాంచి రాజకీయ పదవులను అనుభవిస్తున్న వారిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో భాగంగా భువనగిరి ఎంపిపి తోటకూరి వెంకటేశ్‌యాదవ్‌ను తమ అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసులు విచారిస్తున్నారు.

08/08/2016 - 18:14

హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజి కేసులో రాంచీకి చెందిన శ్యామ్‌ యాదవ్‌ అలియాస్‌ గుడ్డూను, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్స్‌ సంస్థలో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఎనిమిది మంది విద్యార్థులను ముంబై శిబిరానికి తరలించి రూ.60 లక్షలు శ్యామ్‌ యాదవ్‌ వసూలు చేశాడు. రూ.50 లక్షలు శ్యామ్ యాదవ్‌ మయాంక్‌ సింగ్‌కు ఇచ్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.

08/08/2016 - 18:12

నల్గొండ: మహబూబ్‌నగర్ జిల్లాలో గ్యాంగ్‌స్టర్, మాజీ నక్సలైటు నరుూంను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన అనంతరం నల్గొండ జిల్లాలో అతని బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడలో నరుూం అత్త, బావమరిది ఇళ్లలో సోదాలు చేశారు. పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి నరుూం అత్త, బావమరిదిలను ప్రశ్నిస్తున్నారు.

08/08/2016 - 18:09

మహబూబ్‌నగర్: సోమవారం ఉదయం షాద్‌నగర్ వద్ద ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ నరుూంను హతమార్చిన అనంతరం పోలీసులు నరుూం ప్రధాన అనుచరుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరారైన నరుూం డ్రైవర్, ఇతర అనుచరుల ఆచూకీ కోసం క్షుణ్ణంగా గాలింపు జరుగుతోంది.

08/08/2016 - 18:07

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల చేరికను ఆమోదిస్తూ స్పీకర్ మధుసూదనాచారి గతంలో తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. 12 మంది టి.టిడిపి ఎమ్మెల్యేలు తాము తెరాసలో విలీనం అవుతున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుగా కాకుండా, వీరంతా తెరాసలో విలీనం అయినట్లు స్పీకర్ ప్రకటించారు.

08/08/2016 - 17:58

హైదరాబాద్ : జీవో 123పై సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రేపటి వరకూ గడువు కోరడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని... వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ అఫిడవిట్లో విన్నవించారు.

Pages