S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/16/2016 - 07:40

ఆదిలాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో భోజనం వికటించడంతో పాటు వడగాలుల తాకిడికి నీరసంగా ఉన్నారు.

05/16/2016 - 02:06

కష్టాల్లో పడిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి వినియోగదారులపై వెయ్య కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. పాలేరు ఉప ఎన్నిక ముందు టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించడం ఎందుకులే అని ఆగిన ప్రభుత్వం, నేటితో ఉప ఎన్నిక ముగుస్తుండటంతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. అయతే విద్యుత్ విషయంలో ఇప్పటికే జనామోదం పొందిన ప్రభుత్వం, అపవాదు రాకుండా కార్యం పూర్తి చేయాలన్న తలంపుతో కనిపిస్తోంది.

05/16/2016 - 02:02

హైదరాబాద్, మే 15: నారాయణపూర్ డ్యామ్ నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కృష్ణా జలాలను కర్నాటక విడుదల చేసింది. కర్నాటక నీటి విడుదల గురించి నారాయణపూర్ సిఇ మహబూబ్‌నగర్ సిఇ ఖగేందర్‌రావుకు అధికారికంగా సమాచారం పంపించారు. మంగళవారం నాటికి నారాయణపూర్ డ్యామ్ నుంచి ఒక టిఎంసి కృష్ణా జలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటాయి.

05/16/2016 - 01:55

ఖమ్మం, మే 15: అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పాలేరు ఉప ఎన్నిక సోమవారం జరగనున్నది. 4 గ్రామీణ మండలాల్లో విస్తరించివున్న ఈ నియోజకవర్గంలో 1,90,351 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు వినియోగించుకునేందుకు 108 గ్రామపంచాయతీల పరిధిలో 243 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ బూత్‌లలో దేశంలోనే మొదటిసారిగా వివిప్యాట్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

05/16/2016 - 01:53

హైదరాబాద్, మే 15: తక్కువ చార్జీలతో, నాణ్యమైన సేవలు అందించే తెలంగాణ ఆర్టీసి నష్టాల ఊబిలో చిక్కుకుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నష్టాలు తగ్గుతాయని, అంతర్గత సామర్థ్యం పెంచుకుని లాభాల పంట పండిస్తుందన్న ఆశలు కల్లలయ్యాయి. దాదాపు 50 వేల మంది సిబ్బందితో, 10వేల 600 బస్సులతో, 94 డిపోలతో మెరుగైన సేవలు అందిస్తున్నా, రూ.700 కోట్ల నష్టాల ఊబిలో సంస్థ ఉంది.

05/15/2016 - 16:42

హైదరాబాద్:కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై విస్తృత ప్రచారం చేస్తామని, ప్రజల్లోకి తీసుకువెళతామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.

05/15/2016 - 16:41

హైదరాబాద్:తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లిపోయినంతమాత్రాన పార్టీకి నష్టం లేదని, ప్రజల్లో ఆదరణ ఉందని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడిపి తుడిచిపెట్టుకుపోయిందన్న టిఆర్‌ఎస్ నేతల ఫ్రచారంలో అర్థం లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో వైకాపా తుడిచిపెట్టుకుపోతున్న విషయాన్ని గమనించాలని అన్నారు.

05/15/2016 - 16:40

హైదరాబాద్:ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మరోవారం రోజులపాటు వడగాలులు వీస్తాయని, మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

05/15/2016 - 04:46

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ (ఎల్‌బి స్టేడియం)లోని తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాయంలో రైతులు (్భర్యాభర్తలు) నాగలితో భూమి దున్నుతున్నట్టు ఒక బొమ్మను గతంలో ఈ శాఖ ఏర్పాటు చేసింది. ఈ బొమ్మ ఇటీవల కింద పడిపోయింది. దీన్ని చూస్తే రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఈ పరిస్థితి ఎవరికైనా బాధ కలుగిస్తోంది.

05/15/2016 - 04:39

హైదరాబాద్, మే 14: మిషన్ కాకతీయ పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పనుల పురోగతిలో చాలా వెనకబడ్డారని వరంగల్ జిల్లా ఎస్‌ఇ విజయ భాస్కర్‌ను సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ 1, 2 పనులపై జిల్లాల వారిగా మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర సగటు కన్నా వెనుకబడిన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

Pages