S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/10/2019 - 01:01

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావువెల్లడించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను సుమారు గంటకుపైగా సుదీర్ఘంగా ఆయన చదివి వినిపించారు. ఏపీ విభజనకు ముందు తెలంగాణకు నిధుల విడుదలలో అన్యాయం జరిగిందన్నారు.

09/10/2019 - 00:58

హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సోమవారం ప్రవేశపెడుతూ, ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెటేతర నిధులను వినియోగించాని సంకల్పించామని చెప్పారు. ఆర్థిక సంస్థలు, మూలధన వాటాలను కలిపి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

09/10/2019 - 00:57

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక మాంధ్యం కుదిపేస్తోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శాసన సభలో సోమవారం ఆయన 2019-20 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రతిపాదించారు. 2019 ఫిబ్రవరిలో ఓట్-ఆన్-అకౌంట్ ప్రతిపాదించగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1,46,492.30 కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్‌ను తాజాగా ప్రతిపాదించారు.

09/09/2019 - 16:59

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో వీటిలో అవకతవకలు జరిగాయని కాబట్టి వీటిని రద్దు చేయాలని ప్రభుత్వం లేఖలతో కోరుతున్నదని, వీటి రద్దు వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. వంద రోజుల ప్రగతిపై ఆయన ఒక నివేదిక సమర్పించారు.

09/09/2019 - 13:10

నిర్మల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా తనూర్ మండలం బోల్సా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్సా గ్రామానికి చెందిన లక్ష్మణ్ (45) అనే రైతు అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

09/09/2019 - 13:10

హైదరాబాద్: నల్లమలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా నేడు బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు విస్తత్ర బందోబస్తు ఏర్పాటుచేశారు.

09/09/2019 - 13:06

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటూ అగ్రగామిగా నిలిచిందని అన్నారు. మొత్తం బడ్జెట్ రూ.1,46,492.6 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వ్యయం 1,11,055 కోట్లు, మూలధనం రూ.

,
09/09/2019 - 05:09

మహదేవ్‌పూర్, సెప్టెంబర్ 8: తెలంగాణ, మహారాష్టలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లడంతో కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

09/09/2019 - 05:06

నల్లగొండ, సెప్టెంబర్ 8: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న వరద ఉద్ధృతి నేపధ్యంలో నాగార్జున సాగర్‌కు సైతం ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తోంది. ఆదివారం శ్రీశైలం నుండి సాగర్‌కు 86,792 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తుండగా, సాగర్ జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు, 312 టీఎంసీలకుగాను 587.10 అడుగులకు, 308.56 టీఎంసీలకు చేరింది.

09/09/2019 - 05:05

విజయపురిసౌత్, సెప్టెంబర్ 8: నాగార్జునసాగర్ జలాశయానికి పూర్తిస్థాయిలో వరద నీరు చేరటంతో తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకుల కోసం సాగర్ - శ్రీశైలం లాంచీ సర్వీసు ప్రారంభించి రెండు రోజులు గడుస్తున్నా, ఏపీ పర్యాటక శాఖ ఇంకా వెనుకంజలోనే ఉండిపోయింది. అనుమతులు లేవంటూ సాగర్ - శ్రీశైలం లాంచీలను ఇంతవరకూ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించక పోవటంపై పర్యాటకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Pages