S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/09/2019 - 04:22

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనంలోకి వెళ్లాలని, అవినీతి పనులను ఎండగట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీన మహబూబ్‌నగర్ నుంచి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

09/09/2019 - 01:10

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 2019-20 వార్షిక బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. ప్రగతిభవన్‌లో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సోమవారం శాసనసభ, శాసనమండలి ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చర్చించింది. అనంతరం బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం పూర్తిస్థాయి మంత్రిమండలి సమావేశం

09/09/2019 - 01:09

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ఆదివారం జరిగింది. కేసీఆర్ కొత్త జట్టు వచ్చేసింది. రాష్ట్ర గవర్నర్‌గా ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌లో ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న స్థానాలన్నీ భర్తీ అయ్యాయి.

09/07/2019 - 00:49

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా ప్రబలుతున్న సీజనల్ వ్యాధులతో ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. గాంధీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సెమినార్ హాల్, లైబ్రరీలను మంత్రులు శుక్రవారం ప్రారంభించారు.

09/07/2019 - 00:47

హైదరాబాద్, సెప్టెంబర్ 6: కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం పెరిగిన జరిమానాలు త్వరలో అమలు కానున్నాయి. వాహనదారులపై భారం పడనున్నది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన చట్టంపై వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాదారులు భారీ జరిమానాలు కట్టక తప్పదు.

09/07/2019 - 00:46

హైదరాబాద్, సెప్టెంబర్ 6: దసరా, దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 132 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కాచిగూడ, తిరుపతి, కాకినాడ, నాందేడ్, నాగర్‌సోల్ మధ్య 132 రైళ్లను నడపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్, నవంబర్, డిశంబర్ నెలల్లో ప్రయాణీకుల కోసం రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తారు.

09/07/2019 - 00:46

హైదరాబాద్, సెప్టెంబర్ 6: మలేషియాలో జరిగిన తొమ్మిదో అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్‌లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే.చంద్రశేర్‌రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

09/07/2019 - 00:45

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో రైతాంగం యూరియా కోసం పడికాపులు కాస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా నిద్రపోతున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంకు రాసిన బహిరంగ లేఖను రమణ మీడియాకు విడుదల చేశారు.

09/07/2019 - 00:45

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ నమూనాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ విధానాలకు ఇప్పటికే దేశ, విదేశాల్లో ప్రశంసలు లభించాయన్నారు. తెలంగాణ ఐటీ విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన యూకే సిన్హా కమిటీ సిఫారసు చేసిందని జయేశ్ రంజన్ గుర్తు చేశారు.

09/07/2019 - 00:44

హైదరాబాద్, సెప్టెంబర్ 6: వ్యవసాయ, హార్టికల్చర్ వర్సిటీల్లో పేమెంట్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 11న కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్సిటీల రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ఎంసెట్- 2019లో 13,999 లోపు ర్యాంకులు పొంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కౌనె్సలింగ్‌కు అర్హులని ఆయన తెలిపారు. కౌనె్సలింగ్ హాజరయ్యే అభ్యర్థులు రూ.

Pages