S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 23:28

చిన్నశంకరంపేట, ఆగస్టు 5: ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధి కొర్విపల్లి గ్రామంలో పాఠశాల గదులు, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన ఉంటుందని, ఈ ఏడు మొదటి తరగతికిగాను ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందన్నారు. ఈ విద్య కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు.

08/05/2016 - 23:28

తొగుట, ఆగస్టు 5: మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మండలంలోని వేములగాట్‌లో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు శుక్రవారం నాటికి 62వ రోజుకు చేరుకున్నాయి. వేములగాట్‌లోని మంగారి మహిళ సంఘం సభ్యులు దీక్షలు చేపట్టారు. గ్రామ నాయకులు, ప్రజలు సంఘీభావం తెలిపారు.

08/05/2016 - 23:27

మిరుదొడ్డి, ఆగస్టు 5: విద్యుత్ వైర్లు కిందకు వున్న కారణంగా లారీకి వైర్లు తగిలి 4 స్తంభాలు విరిగిపోయి రోడ్డుపై పడ్డ సంఘంటన మిరుదొడ్డి మండల కేంద్రంలో శుక్రవారంనాడు జరిగింది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. మండల కేంద్రంలో ప్రధానరోడ్డు పక్కన అంబేద్కర్ విగ్రహం వద్ద వున్న స్తంభం వైర్లు కొన్ని రోజుల నుంచి కిందకు వేలాడుతున్నాయి.

08/05/2016 - 23:27

జగదేవ్‌పూర్, అగస్టు 5:సిఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మాధవిశ్రీలత, వరంగల్ డాట్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఉమారెడ్డిలు పరిశీలించారు. శుక్రవారం వారు పర్యటించి రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ముఖ్యంగా సోయాబీన్‌కు సంక్రమించే వైరస్, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు.

08/05/2016 - 23:26

జోగిపేట, ఆగస్టు 5: జోగిపేట పట్టణంలో శుక్రవారం నాడు ఎమ్మార్పీఎస్ పిలుపుమేరకు విద్యాసంస్థల బంద్ జరిగింది. పార్లమెంట్‌లో ఎబిసిడి వర్గీకరణ కోసం బిల్లు పెట్టాలని కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపించారు. ఈ బంద్ కార్యక్రమంలో నాయకులు మహేశ్, రమేశ్, రఘు, శ్రీనివాస్, నాగేశ్, శంకరయ్య, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

08/05/2016 - 23:26

కొండపాక, ఆగస్టు 5: 123జిఓ వద్దని 2013చట్టమే ముద్దని ఎర్రవల్లి గ్రామస్తులు శుక్రవారం ర్యాలీ తీశారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లిలో చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి 2013చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని నినాదాలు చేశారు. తమకు సరైన న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామన్నారు.

08/05/2016 - 23:24

మహబూబ్‌నగర్, ఆగస్టు 5: ఎన్నికల సమయంలో రైతాంగానికి లక్ష రూపాయల పంటల రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక విడతల వారీగా రుణమాఫీ అంటూ రైతులను దగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని, మోసం మాటలు చెప్పడంలో ఆయనకు దిట్ట దేశంలోనే ఎవరు లేరని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

08/05/2016 - 23:23

మక్తల్, ఆగస్టు 5: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయపూర్ డ్యాంములు నిండుగా కళకళలాడుతుండటంతో దిగువన ఉన్న మన జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి అధికం కావడంతో మక్తల్ మండలంలో నిర్మించిన 6ఘాట్లు నీట మునిగి తేలాడుతున్నాయి.

08/05/2016 - 23:23

కల్వకుర్తి, ఆగస్టు 5: ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలోని పేద ప్రజల సద్వీనియోగంతోనే బంగారు తెలంగాణ సాద్యమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

08/05/2016 - 23:22

పెబ్బేరు, ఆగస్టు5: పుష్కర పనులు త్వరలో పూర్తి కానించాలని కలెక్టర్ శ్రీదేవి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాలోని అతిపెద్ద ఘాట్ అయిన రంగాపూర్ పుష్కరఘాట్‌ని అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఘాట్లు పూర్తి అయినప్పటికి విద్యుత్ పనులు, తాత్కలిక షెడ్లు, పిండ ప్రధానాల షెడ్లు ఇంకా పనులు జరుగుతున్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని, పుష్కరాల సమయం ముంచుకొస్తుందని తెలిపారు.

Pages