S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 23:52

ఆదోనిటౌన్, ఆగస్టు 4: పట్టణంలోని ఎరువుల, క్రిమి సంహారక మందుల దుకాణాలపై, ఎరువుల తయారి గోదాములపై గురువారం ప్రత్యేక విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన దాడులతో ఎరువుల దుకాణాల యజమానులు తమ దుకాణాలకు తాళం వేసి పరుగులు పెట్టారు. ఈవిషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు దుకాణాలు తెరువక పోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని 7 దుకాణాలను దాడులు నిర్వహించి రూ.

08/05/2016 - 23:52

కర్నూలు, ఆగస్టు 4 : జిల్లా పరిషత్, సాగునీటి సలహా మండలి సమావేశాలు శుక్రవారం కర్నూలులో నిర్వహించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించే జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధానంగా సాగునీటి సమస్య, సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చ సాగే అవకాశం ఉంది.

08/05/2016 - 23:51

మంత్రాలయం, ఆగస్టు 4: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో గురువారం శ్రీ ప్రహ్లాద రాయలను ఘనంగా బంగారు రథోత్సవంపై ఊరేగించారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యే క పూజలు చేశారు. బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగించారు.

08/05/2016 - 23:51

ఎమ్మిగనూరు, ఆగస్టు 4: దీర్గ కాలంగా పెండింగ్‌లో ఉన్న కర్నూలు - మంత్రాలయం రైల్వేలైన్‌ను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి, ఎంపిలు టిజి.వెంకటేష్, రాంమోహన్‌నాయుడు గురువారం ఢిలీలో స్టేట్ రైల్వే ఇండిపెండెంట్ ఛార్జి మంత్రి రాహైన్ గోయల్‌కు గురువారం సాయంత్రం వినతిపత్రం సమర్పించిన్నట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఢిల్లీ నుండి విలేఖర్లకు ఫోన్‌లో వెల్లడించారు.

08/05/2016 - 23:50

నందికొట్కూరు, ఆగస్టు 4 : కరవు కాటకాలకు నిలయమైన, తాగు, సాగునీరు అందక సతమతమవుతున్న రాయలసీమకు వరప్రదాయినిగా భావిస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నేటి నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండడంతో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తుంది.

08/05/2016 - 23:30

గజ్వేల్, ఆగస్ట్ 5 : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందకు సాగి సిఎం కెసిఆర్ కన్న కళలు నిజం చేద్దామని కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి, మెట్రో వాటర్‌వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మొక్కలు నాటడంతోపాటు ఔషధ మొక్కల పార్కును పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

08/05/2016 - 23:30

గజ్వేల్, ఆగస్ట్ 5 : తెలంగాణా సిద్దించాక తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో అధికారిక పర్యటన చేస్తుండగా, దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.

08/05/2016 - 23:29

చిన్నశంకరంపేట, ఆగస్టు 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల తరువాత అమె విలేఖరులతో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు రానున్న ప్రధాని బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగాపాల్గొని రాష్ట్ర ప్రతిష్టతను కాపాడాలన్నారు.

08/05/2016 - 23:29

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 5: ఎన్నికలకు ముందు తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామిలను అమలు చేయాలని, హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు జి.శశికళ యాదవరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ, హామిలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

08/05/2016 - 23:29

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 5: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పక్షాన హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) పేర్కొన్నారు. 123జివోను రద్దు చేస్తూ తెరాస ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా సుప్రీంకోర్టు అప్పీల్‌కు వెళ్తాననడం సిగ్గుచేటన్నారు.

Pages