హోదా కోసం చంద్రబాబు ఒత్తిడి తేవాలి
Published Thursday, 4 August 2016విజయవాడ: ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఇతర పార్టీలతో పాటు మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు ఇపుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే చట్టాలను సవరించైనా ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అవసరాల మేరకు మార్చడం కొత్తేమీ కాదన్నారు. ఎపి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నారు.