S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/09/2017 - 02:44

కడప, అక్టోబర్ 8: ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆ శాఖ ఇంజినీర్లు, అధికారులను హెచ్చరించారు. కడపలో ఆదివారం మంత్రి కాలవ గృహ నిర్మాణ శాఖ ఏఇలు, డిఇలు, సహాయ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.

10/09/2017 - 02:43

విజయవాడ, అక్టోబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవిత్ర సంకల్పంతో రాష్టవ్య్రాప్తంగా సెప్టెంబర్‌లో చేపట్టిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంతో వరుణ దేవుడు కరుణించినందుకే రాష్ట్రంలో వర్షాలు బాగా పడ్డాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

10/09/2017 - 02:42

విజయవాడ, అక్టోబర్ 8: నయా ఉదారవాద విధానాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఘటన ఎదురవుతోందని, మన దేశంలోనూ ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ, లౌకిక ప్రజాతంత్ర ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు.

10/09/2017 - 02:40

విజయవాడ, అక్టోబర్ 8: సింగపూర్ అభివృద్ధిని స్వయంగా రైతులకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు స్థానిక సిఆర్డీఏ కార్యాలయంలో ఆదివారం లాటరీ ద్వారా రైతులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో స్క్రూటినీ చేయగా నిబంధనలకు అనుగుణంగా 123 మందిని పర్యటనకు అర్హులుగా తేల్చారు.

10/09/2017 - 02:38

కదిరి, అక్టోబర్ 8: అనంతపురం జిల్లా నల్లచెరువు మండల పరిధిలోని సంజీవపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ దినపత్రికకు చెందిన పేపర్ చేర వేసే జీపుపైకి లారీ దూసుకెళ్లిన సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. వివరాలు.. అనంతపురం వైపు నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అదుపు తప్పి మదనపల్లి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది.

10/09/2017 - 02:38

నెల్లూరు, అక్టోబర్ 8: తాను ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమోదించిన పనులనే ప్రస్తుతం తిరిగి విమర్శించడం ఎంత వరకు సబబో మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆలోచించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరులో బ్రాహ్మణ సహకార పరపతి సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

10/09/2017 - 02:37

నెల్లూరు, అక్టోబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి నిర్దేశించిన ప్రాంతం సహేతుకం కాదని మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి మునక ప్రాంతమని, భవిష్యత్తులో వరద ముంపునకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు.

10/09/2017 - 02:37

విశాఖపట్నం, అక్టోబర్ 8: అకృత్యాలకు పాల్పడే వారిని ఎటువంటి పరిస్థితుల్లోను విడిచిపెట్టేదిలేదని, మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వదిలేదిలేదని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. విశాఖలోని కెజిహెచ్‌ను ఆమె ఆదివారం సందర్శించారు. వార్డుల్లో పర్యటిస్తూ అక్కడ రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించారు.

10/09/2017 - 02:36

ఆకివీడు, అక్టోబర్ 8: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం బాణాసంచాతో వెళుతున్న ఆటోలో హఠాత్తుగా సంభవించిన పేలుడులో ఒకరు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వహిస్తున్న జాతర కోసం భీమవరంలోని ఎ ముసలయ్యకు చెందిన వెంకట మణికంఠ ఫైర్ వర్క్స్ నుంచి బాణాసంచాను ఆదివారం తెల్లవారుజామున ఆటోలో తరలిస్తున్నారు.

10/09/2017 - 02:06

విజయవాడ, అక్టోబర్ 8: నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు, పదోన్నతులు పొందారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇతర రాష్ట్రాల్లో తగిన అనుమతి లేని విద్యాసంస్థల నుంచి బిఎస్సీ (ఎజి) ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రాలు దాఖలు చేసి, రాష్ట్రంలో కొందరు వ్యవసాయ శాఖాధికారులు పదోన్నతులు, ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Pages