S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/10/2017 - 02:15

కల్లూరు/మదనపల్లె, అక్టోబర్ 9 : చితూరు జిల్లా మదనపల్లె, పులిచర్ల మండలాల్లో ఆదివారం రాత్రినుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పులిచర్ల మండలం భీమవరం మార్గంలో వంతెన కొట్టుకుపోయింది. పులిచెర్ల మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.

10/10/2017 - 00:28

యలమంచిలి రూరల్, అక్టోబర్ 9: యలమంచిలి జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు మళ్లుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొన్న సంఘటనలో తండ్రీ కూతుళ్లు అక్కడికక్కడే మరణించగా, భార్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరో కుమార్తె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

10/10/2017 - 00:27

గురజాల, అక్టోబర్ 9: ప్రమాద వశాత్తు వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం పాత అంబాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాత అంబాపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి వరలక్ష్మి (50), గన్నవరపు చినలక్ష్మమ్మ (50) కలిసి పొలానికి వెళ్లి, సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి వస్తూ మార్గ మధ్యంలో నల్లవాగును దాటేందుకు దిగారు.

10/10/2017 - 00:27

కల్లూరు/మదనపల్లె, అక్టోబర్ 9 : చితూరు జిల్లా మదనపల్లె, పులిచర్ల మండలాల్లో ఆదివారం రాత్రినుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పులిచర్ల మండలం భీమవరం మార్గంలో వంతెన కొట్టుకుపోయింది. పులిచెర్ల మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.

10/10/2017 - 00:26

శ్రీశైలం, అక్టోబర్ 9: శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 203 టిఎంసిల నీరు నిల్వ ఉంది. మరో రెండు అడుగుల నీరు చేరితే జలాశయం పూర్తిగా నిండుతుంది. ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం 882.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 203.89 టిఎంసిల నీరు చేరింది.

10/10/2017 - 00:24

హైదరాబాద్, అక్టోబర్ 9: అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు హైకోర్టులో చుక్కెదురైంది. ఖాతాదారులను మోసం చేసిన నేరారోపణతో డైరెక్టర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

10/10/2017 - 00:23

విజయవాడ, అక్టోబర్ 9: వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ భృతి, తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగుపై కూడా చర్చ జరుగనుంది. దాదాపు 154 గిరిజన గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించారు.

10/10/2017 - 00:23

విజయవాడ, అక్టోబర్ 9: వైద్య పరమైన నిర్లక్ష్యం వల్ల రోగులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికై న్యాయ సహాయం, సూచనల కోసం జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక విధాగం (సెల్) ఏర్పాటు చేయనున్నట్లు పౌర సరఫరాల కమిషనర్ బి.రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జస్టిస్ అరజిత్ పసాయత్ నేతృత్వంలో ఈ ప్రత్యేక సెల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

10/10/2017 - 00:23

విజయవాడ, అక్టోబర్ 9: కళా, సంస్కృతిక రంగాల్లో ప్రతిభకు పెద్దపీట వేసేందుకు వీలుగా ఇకపై రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఆదివారం ఆనంద లహరి పేరిట వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థల్లో ప్రయోగాత్మకంగా ఆనందలహరి కార్యక్రమాన్ని నిర్వహించాలని గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

10/10/2017 - 00:22

విజయవాడ (క్రైం), అక్టోబర్ 9: అవినీతి అనకొండగా పేరొందిన పాము పాండు రంగారావును ఏసిబి వెంటాడుతోంది. అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో ఆయన బినామీలు బయటపడుతున్నారు. పాండురంగారావు అక్రమ సొమ్ముకు వారసులుగా ఉంటూ కోట్ల రూపాయలు పెట్టుబడులతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పాము బినామీ, అతని బావమరిదిని ఏసిబి అధికారులు సోమవారం విజయవాడలో అరెస్టు చేశారు.

Pages