S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/09/2017 - 02:06

విజయవాడ, అక్టోబర్ 8: జిఎస్టీ వల్ల పెరుగుతున్న అదనపు భారాలు, అధికారుల వేధింపులకు నిరసనగా సోమ, మంగళవారాలు దేశవ్యాప్తంగా రవాణా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ఇందులోభాగంగా రాష్ట్రంలో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలన్నీ మూతబడనున్నాయి. ఆదివారం ఉదయం నుంచే రాష్టవ్య్రాప్తంగా లోడింగ్ పనులు నిలిచిపోయాయి.

10/09/2017 - 02:06

విజయవాడ, అక్టోబర్ 8: తగిన పర్యవేక్షణ లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పూర్తిస్థాయి వేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులు పొందలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీనివల్ల ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 1600 కోట్ల రూపాయల మేర వేతనం, మెటీరియల్ కాంపొనెంట్ కింద నష్టపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

10/09/2017 - 02:05

గుంటూరు, అక్టోబర్ 8: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో త్వరలో మార్పులు, చేర్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. మూడేళ్లుగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో మిత్రపక్షమైన టిడిపి ఒత్తిళ్ల మేరకే ఇప్పటివరకు విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబునే అధ్యక్షుడిగా కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారతాయని నేతలు అంచనా వేస్తున్నారు.

10/09/2017 - 02:00

శ్రీకాకుళం, అక్టోబర్ 8: రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా మారుతుందని, ప్రముఖ నాయకులు పార్టీలో చేరుతారని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ఇక్కడ బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆదివారం విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు.

10/09/2017 - 01:58

విశాఖపట్నం, అక్టోబర్ 8: గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు అనేక రకాలైన ప్రయోగాలు చేస్తుంటారని ఇటువంటి వారిని గుర్తించి తగిన విధంగా ప్రోత్సహిస్తే శాస్తవ్రేత్తలు అవుతారని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

10/08/2017 - 03:50

అమరావతి, అక్టోబర్ 7: వచ్చే మార్చి 31కల్లా రాష్ట్రంలో 22లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలి, నెలకు 4లక్షల చొప్పున 5నెలల్లో 22లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆయన శనివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారానికి 95,704 మరుగుదొడ్లు నిర్మించేలా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలన్నారు.

10/08/2017 - 03:50

విజయవాడ (క్రైం), అక్టోబర్ 7: విజయవాడ కృష్ణలంకలో అత్యంత ఘోరం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఏడేళ్ళ బాలుడిని దుర్మార్గం చిదిమేసింది. అత్యంత రాక్షసత్వంగా నీటిలో ముంచి ప్రాణాలు తీసిన ఉదంతం బాధిత కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వేదన తట్టుకోలేని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు స్థానికుల గుండెను పిండేస్తోంది.

10/08/2017 - 03:47

విజయవాడ, అక్టోబర్ 7: ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి అవి సద్వినియోగం అయ్యేలాగా బ్యాంకర్లు తోడ్పాటు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. శనివారం విజయవాడలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో ముద్ర యోజన పథకం ప్రచార, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

10/08/2017 - 01:48

విశాఖపట్నం, అక్టోబర్ 7: రాష్ట్రంలో 2029 నాటికి 50 శాతం పచ్చదనాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియచేశారు. విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 63వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది.

10/08/2017 - 01:47

హైదరాబాద్, అక్టోబర్ 7: నెల్లూరు జిల్లా కావలి మండలంకు చెందిన సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్టు చర్చస్ (ఎస్‌టిబిసి) ప్రతినిధి జిడిడి దివాకర్‌పై వచ్చిన అభియోగాల దృష్ట్యా దేశం వదిలిపోకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సిబిఐ,సిఐడి శాఖలను ఆదేశించింది. ఎస్‌టిబిసి ప్రత్యేక పాలనాధికారి సిహెచ్ అంజనా ప్రసాద్ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Pages