S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/11/2017 - 03:44

కర్నూలు, అక్టోబర్ 10: జడివాన కర్నూలు జిల్లాను ముంచింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో మంగళవారం సగటున 35.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వాగులు పొంగడంతో మంత్రాలయం నుంచి కర్నాటకకు, నందికొట్కూరు నుంచి నంద్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

10/11/2017 - 03:44

కోరుకొండ, అక్టోబర్ 10: ‘ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.20 వేల నుండి రూ.40వేల వరకు సంపాదించుకోవచ్చు’ ఇలాంటి ప్రకటన చూస్తే ఎవరైనా ఆకర్షితులవుతారు... అలా ఆకర్షితులైన సంప్రదించిన వారికి పేపరు ప్లేట్లు తయారుచేసే యంత్రం, ముడిసరుకు ఇచ్చి, తయారైన ప్లేట్లు తాము తీసుకుని, కొంత మొత్తం కమిషన్ ఇస్తామని తెలిపిందో సంస్థ.

10/11/2017 - 03:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వచ్చే నవంబరు మొదటి వారంలో నిర్వహించనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. శాసనసభ వర్షాకాల, శీతాకాల సమావేశాలు రెండు కలిపి నవంబరు మొదటి వారంలో ప్రారంభమై, పది రోజులపాటు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

10/11/2017 - 03:42

విశాఖపట్నం, అక్టోబర్ 10: భారతీయ రైల్వేకు ఆర్థిక వెనె్నముకగా నిలిచే ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే కెకె లైన్ మార్గంలో రైల్వేట్రాక్, బ్రిడ్జిలపై కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ఈ సంఘటనలు వాల్తేర్ డివిజన్‌లో సర్వసాధారణమవుతున్నా వీటి నివారణ చర్యలకు దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం లభించడం లేదు.

10/11/2017 - 03:41

విశాఖపట్నం, అక్టోబర్ 10: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ఉల్లంఘనలు, అక్రమాలకు పాల్పడేందుకు ఏ మాత్రం వీలు కాని విధంగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్‌చైన్ సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన బ్లాక్‌చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్ మంగళవారం ముగిసింది.

10/11/2017 - 03:29

విజయవాడ, అక్టోబర్ 10: ఇటీవల తరచుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే అంశంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ కమిషనర్ బి.ఉదయలక్ష్మితోపాటు ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉదయం ఆయన సమావేశమయ్యారు.

10/11/2017 - 03:29

విజయవాడ, అక్టోబర్ 10: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను మేళవించి మెరుగైన సమాజం కోసం పాత్రికేయులు విలువలతో కూడిన సమాచారాన్ని సమాజానికి అందించేందుకు నిరంతరం కృషి చేయాలని సమాచార పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపు ఇచ్చారు. మంగళవారం స్థానిక మొగల్రాజపురం రెవిన్యూ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ కార్యాలయాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు.

10/11/2017 - 03:27

చిత్రం..సచివాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రంలో మంగళవారం తన హాజరు నమోదు చేస్తున్న
రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

10/11/2017 - 03:25

గుంటూరు, అక్టోబర్ 10: గుజరాత్ తరహాలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ సుంకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశం తీర్మానించింది. మంగళవారం గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించారు.

10/11/2017 - 03:24

విజయవాడ, అక్టోబర్ 10: రాజధాని అమరావతిలో ఉద్యోగులు, ఐఎఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన గృహ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. 4500 మందికి వసతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.

Pages