S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/15/2017 - 02:43

కర్నూలు, ఆగస్టు 14: నంద్యాల శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో సందడి తగ్గింది. వర్షాలు కురవకపోవడంతో గత రెండు వారాలుగా తమ అభిమాన పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొన్న రైతులు రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో స్వగ్రామాలకు వెళ్లి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ కూలీలు సైతం పొలాల్లోనే గడుపుతుండటంతో నేతల ప్రచార కార్యక్రమంలో ఉత్సాహం తగ్గినట్లయింది.

08/15/2017 - 02:42

తిరుపతి, ఆగస్టు 14: పంద్రాగస్ట్ వేడుకల సందర్భంగా తిరుపతి తారకరామా స్టేడియంలో పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ఎస్వీయూ మ్యూజిక్ కాలేజీ విద్యార్థులచే ‘బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం’ అనే నృత్యప్రదర్శన జరుగుతుంది.

08/15/2017 - 02:41

రాయచోటి, ఆగస్టు 14: ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలకు గాలంవేసి వారిని ప్రేమపేరుతో మోసం చేసే నెల్లూరు జిల్లాకు చెందిన కైతేపల్లి పెంచల వరప్రసాద్‌ను కడప జిల్లా రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు.

08/15/2017 - 02:38

విశాఖపట్నం, ఆగస్టు 14: రైల్వేలో వౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి వస్తు సేవల పన్ను (జిఎస్టీ) ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు వర్తింప చేయడంపై రైల్వే కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మండిపడుతోంది.

08/15/2017 - 04:20

తిరుపతి, ఆగస్టు 14: తిరుపతి ఎస్వీయూ స్టేడియం 71వ స్వాతంత్య్ర దిన వేడుకలకు సన్నద్ధమైంది. సిఎం, ఇతర ప్రముఖులు ఆశీనులు కానున్న వేదికను అందంగా ముస్తాబు చేశారు. వివిధరకాల పుష్పాలతో, అందమైన డిజైన్లతో వేదిక ముందుభాగం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్టేడియం చుట్టూ విఐపిలు, సామాన్యులు కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. తారకరామా స్టేడియం పంద్రాగస్ట్ వేడుకల ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకుంటోంది.

08/15/2017 - 00:21

విశాఖపట్నం, ఆగస్టు 14: ప్రఖ్యాత కథా రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మికి మాలతీ చందూర్ అవార్డును ఇవ్వనున్నారు. గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇస్తున్న మాలతీ చందూర్ అవార్డును శివరాజు సుబ్బలక్ష్మికి ఈ నెల 21న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్టు పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

08/15/2017 - 00:20

హైదరాబాద్, ఆగస్టు 14: వంతెన నిర్మాణ పనుల కారణంగా చెన్నై-గూడూరు సెక్షన్‌లో ఈ నెల 15న రెండు పాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారిమళ్లించడం, మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ సెక్షన్‌లో నాయుడుపేట యార్డ్, ఓడూరు యార్డ్ వద్ద వంతెన పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

08/15/2017 - 00:20

విజయవాడ, ఆగస్టు 14: విద్యుత్ ఆదా లక్ష్యంగా విశాఖలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.32 లక్షల యూనిట్ల మేర విద్యుత్ ఆదా చేసేందుకు అనుసరించాల్సి విధానాలు, తదితర అంశాలను చర్చించేందుకు ఈ నెల 18న విశాఖపట్నంలో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉంది.

08/15/2017 - 00:19

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 14: నంద్యాలలో ఉప ఎన్నికలు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కాపులను ప్రభావితం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం మరో వంచనకు దిగిందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఎప్పటిలోగా పూర్తి అవుతుందో స్పష్టం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో రఘువీరా డిమాండ్ చేశారు.

08/15/2017 - 00:19

విజయవాడ, ఆగస్టు 14: కాపులకు సత్వరం బిసి రిజర్వేషన్ల కల్పనలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా, ముఖ్యంగా బిసి వర్గాల నుంచి వ్యతిరేకత ప్రబలకుండా ఉండేందుకుగాను ప్రస్తుత బిసి కోటాతో ప్రమేయం లేకుండా కేవలం విద్యా, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదంటూ సోమవారం విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సదస్సుకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు.

Pages