S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/16/2017 - 01:35

విజయనగరం, ఆగస్టు 15: జిల్లాలోని బోగాపురం మండలం అప్పన్నపేట వద్ద స్కూలు బస్సు బోల్తా పడటంతో 20 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బోగాపురం మండలంలోని చంద్ర విద్యా నికేతన్‌కు చెందిన బస్సు ముక్కాం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మోటార్‌బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తాపడింది.

08/16/2017 - 01:31

విజయవాడ, ఆగస్టు 15: రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఆయన జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం సమావేశ మందిరంలో విలేఖరులతో మాట్లాడుతూ ఫార్మా, టూరి జం, విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని తెలిపారు.

08/16/2017 - 00:22

విజయవాడ, ఆగస్టు 15: హైదరాబాద్ నగరంలోని ఆర్‌టిసి ఆస్తుల పంపిణీపై తాడో పేడో తేల్చుకోటానికి అటు తెలంగాణా ఆర్‌టిసి ఇటు ఏపి ఆర్‌టిసి సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం గడచిన మూడేళ్లలో ఇప్పటికి పలుమార్లు ప్రాథమిక చర్చలు జరిగాయి. ఇటీవల చివరగా జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయల విలువైన 14 రకాల ఆస్తులపై తొలుత వివాదం నెలకొంది.

08/16/2017 - 00:21

అమరావతి, ఆగస్టు 15: టిడిపి ఎమ్మెల్సీ, విజయవాడ నగర టిడిపి అధ్యక్షుడు బుద్దా వెంకన్న.. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు రాసిన బహిరంగ లేఖ అధికార పార్టీని ఇరుకున పడేసింది.

08/15/2017 - 23:01

కర్నూలు, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీ. అయితే కర్నూలులో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కెయి స్థానంలో కలెక్టర్ సత్యనారాయణ జెండా ఎగురవేశారు.

08/15/2017 - 23:01

విశాఖపట్నం, ఆగస్టు 15: భారీ ఎత్తున రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన సర్వే ఇన్‌స్పెక్టర్ గణేశ్వరరావును విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. విశాఖ భూ కుంభకోణంలో గణేశ్వరరావు ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఆయన వెనక కొన్ని బలమైన శక్తులు ఉండి, ఈ కుంభకోణాన్ని నడిపించాయని ప్రాథమికంగా తెలుస్తోంది.

08/15/2017 - 04:17

కడియం, ఆగస్టు 14: నర్సరీలకు విద్యుత్తు మీటర్ల బిగింపును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు సోమవారం దేశవ్యాప్తంగా మొక్కలు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేశారు. ఏడు గంటల పాటు నిరవధిక ఆందోళనకుదిగారు. గత ప్రభుత్వాలు నర్సరీలకు ఉచిత విద్యుత్‌ను అమలుచేశాయని, ప్రస్తుత ప్రభుత్వం నర్సరీలపై విద్యుత్ బిల్లుల భారం మోపే ప్రయత్నం చేస్తోందంటూ నర్సరీ రైతులు ఈ ఆందోళనకు దిగారు.

08/15/2017 - 04:12

కాకినాడ, ఆగస్టు 14: శాంతియుతంగా పాదయాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్న తనను గత 20రోజులుగా గృహనిర్బంధంలో ఉంచారని, ఇలా చేయడానికి మీ వద్ద లిఖితపూర్వకమైన ఆదేశాలున్నాయా? అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోలీసులను ప్రశ్నించారు. ఏ వ్యక్తినైనా చట్టప్రకారం 24గంటలకు మించి నిర్బంధించరాదని, అయితే తనను 20రోజులుగా గృహనిర్బంధంలో ఉంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

08/15/2017 - 04:10

అమలాపురం, ఆగస్టు 14: దేశానికి స్వాతంత్య్రం లభించి 70 వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సోమవారం 70వేల రూపాయి నాణేలతో 70 అడుగుల భారతదేశ పటాన్ని రూపొందించారు. అమలాపురానికి చెందిన ఎస్‌బిఐ సీనియర్ అసిస్టెంట్ ఇవటూరి రవిసుబ్రహ్మణ్యం స్థానిక సివి రామన్ పాఠశాల ఆవరణలో తాను సేకరించన 70వేల రూపాయి నాణేలతో ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించారు.

08/15/2017 - 04:08

విశాఖపట్నం, ఆగస్టు 14: రెవెన్యూ శాఖలో ఆయనది కేవలం సర్వేయర్ ఉద్యోగం. అధికారులకు మాయమాటలు చెప్పి, వారిని లోబరుచుకుని రికార్డులను తారుమారు చేయడం, కోట్ల రూపాయల భూములను వేరొకరి పేరున బదలాయించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసిబికి దొరికిపోయి, సస్పెండ్ అయినా సదరు సర్వేయర్ మారలేదు.

Pages