S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/18/2017 - 01:04

విజయవాడ, ఆగస్టు 17: భవానీ ద్వీపం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు విఘాతం కలగని రీతిలో ఈ అభివృద్ధి ప్రణాళిక రూపుదిద్దుకోనుండటం విశేషం. అంతర్జాతీయ స్థాయి హంగులతో ఇక్కడి వివిధ ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పలు సంస్థలు ముందుకు రాగా, బోస్టన్‌కు చెందిన సిబిటి సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు.

08/18/2017 - 01:03

విజయవాడ, ఆగస్టు 17: 2010-13 సంవత్సరాల్లో డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి పొందినవారికి ప్రభుత్వం తక్షణమే కమిషనరేట్ ఆఫ్ కాలేజి ఎడ్యుకేషన్ (సిసిఈ) ఫిట్‌మెంట్ ఫార్ములా అమలుచేయాలని ఏపి ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

08/18/2017 - 01:02

విజయవాడ, ఆగస్టు 17: ఆరు రోజులపాటు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్ రాత పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇందుకుగాను విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 3900 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా వీరిలో 63 శాతం మంది హాజరయ్యారు. పలు కేంద్రాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు.

08/18/2017 - 01:02

విజయవాడ, ఆగస్టు 17: ఓటమి భయంతో సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోటాపోటీగా కోట్లాది రూపాయల అక్రమార్జిత సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు ప్రశాంతంగా నిబంధనల కనుగుణంగా జరిగితే దిమ్మతిరిగే ఫలితాలు రాగలవన్నారు. నంద్యాల ఉప ఎన్నికను రద్దుచేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

08/17/2017 - 02:21

విజయవాడ (క్రైం)/మంగళగిరి: నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. సాంకేతిక పరిఙ్ఞనాన్ని అందిపుచ్చుకుంటూ వినూత్న తరహాగా ఆలోచిస్తే ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్నారు.

08/17/2017 - 02:20

విజయవాడ: వెలగపూడిలోని సచివాలయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ బుధవారం సందర్శించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన, ఆమె సచివాలయాన్ని, అసెంబ్లీని, మున్సిపల్ కమాండ్ కంట్రోల్ విభాగాలను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

08/17/2017 - 02:20

విజయవాడ: శాసనసభ, హైకోర్టు భవంతులపై ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా కొత్త ఆకృతులు సిద్ధం చేశామని ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తెలియజేశారు. వీటితోపాటు అమరావతిలో పరిపాలన నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై 400 పేజీల నివేదికను ఈ నెల 24, 25 తేదీల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని వారు చెప్పారు.

08/17/2017 - 02:20

విజయవాడ: దుల్హన్ పథకం ద్వారా ముస్లిం మైనార్టీ యువతులకు వివాహ సందర్భంగా ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్న ప్రోత్సాహక మొత్తం ఇక నుంచి ‘సెర్ప్’ ద్వారా చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. బుధవారం ఆమె స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవన సముదాయంలోని సెర్ప్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి అమలులో ఉన్న పలు పథకాల పురోగతిని సమీక్షించారు.

08/16/2017 - 03:37

రేణిగుంట, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి ఎస్వీయూలోని తారకరామా స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంద్రాగస్టు వేడుకలలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పంద్రాగస్టు వేడుకలతో నగర జనం పులకించారు.

08/16/2017 - 03:34

రాజమహేంద్రవరం, ఆగస్టు 15: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపులను నిర్దేశిత గడువు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు.

Pages