S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/16/2017 - 03:32

హిరమండలం: శ్రీకాకుళం జిల్లాలో వంశధార రిజర్వాయర్ నిర్మాణం గట్టుకు సంబంధించి సేకరిస్తున్న మట్టి తవ్వకాలను మంగళవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హిరమండలం మండలంలోని తులగాం పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మట్టి సేకరణకు వచ్చిన యంత్రాలను నిర్వాసితులు అడ్డగించారు. దీంతో పనులను నిలిపివేసి యంత్రాలను వెనక్కి తరలించారు.

08/16/2017 - 03:30

కాకినాడ, ఆగస్టు 15: రాష్ట్రానికి నీరే ప్రగతి, సంపద అని, నీళ్ళు లేకపోతే కన్నీళ్ళే మిగులుతాయని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జలాన్ని ప్రతి ఒక్కరు అతి పవిత్రంగా భావించాలని, జలసిరికి హారతులివ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే మూడు నెలల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 28 ప్రాజెక్టులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.

08/16/2017 - 03:29

ఏలూరు, ఆగస్టు 15: ప్రభుత్వం ఏటేటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తరీతిలో సాగాయి. జిల్లా కేంద్రంతో ఏలూరుతోపాటు, ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొవ్వూరులో ఘనంగా జరిగాయి.

08/16/2017 - 03:23

విజయవాడ, ఆగస్టు 15: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల స్ఫూర్తితో నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు పునరంకితం కావాలని ఏపి ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ గాంధీనగర్‌లోని ఏపి ఎన్జీవో హోం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

08/16/2017 - 03:22

గుంటూరు, ఆగస్టు 15: నంద్యాలలో ఉపఎన్నిక జరక్కుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు.

08/16/2017 - 03:21

విజయవాడ, ఆగస్టు 15: ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను శాసన మండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన చక్రపాణిరెడ్డి, ఇటీవలే వైకాపాలో చేరారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పంపడంతో దానిని మండలి చైర్మన్‌ను ఆమోదించారు. దీంతో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.

08/16/2017 - 01:38

కర్నూలు, ఆగస్టు 15:‘మేమే గెలుస్తాం.. అత్యధిక మెజారిటీ కోసమే పని చేస్తున్నాం.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఆశలు వదులుకోవాల్సిం దే..’ ఇవి నంద్యాల శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో నాయకుల నోటి నుంచి వస్తున్న మాటలు.

08/16/2017 - 01:39

నంద్యాల, ఆగస్టు 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి మీ వద్దకు వస్తాడని, ఆయన కాలర్ పట్టుకుని నిలదీయాలని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నంద్యాల పట్టణంలో జగన్ రోడ్ షో నిర్వహించారు.

08/16/2017 - 01:36

విజయవాడ, ఆగస్టు 15: రాజధాని అమరావతి పరిధిలోని నవులూరు రెవెన్యూ ఎర్రబాలెం దగ్గర ఏర్పాటు చేయనున్న లండన్ కింగ్స్ కాలేజ్ హాస్పటల్, ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీకి ఆగస్టు 16 బుధవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

08/16/2017 - 01:35

ఎర్రుపాలెం, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన దంతాల భవాని మంగళవారం ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ వున్నారు. ఉదయం పురిటినొప్పులు రాగా వెంటనే కృష్ణాజిల్లా తిరువూరులో ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకొనివెళ్ళారు. హాస్పిటల్‌లో నలుగురు పిల్లలకు జన్మనిచినట్లు భవాని భర్త రామకృష్ణ తెలిపాడు.

Pages