S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/07/2017 - 03:38

కాకినాడ, ఆగస్టు 6: కాపులను బిసిల్లో చేర్చడానికి తీర్మానాన్ని వచ్చే వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలిసింది. కాపులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే కాపులకు ప్రభుత్వం చేసిన మేలుకు సంబంధించిన ఘనత అంతా కాపు మంత్రులకే దక్కేలా వ్యూహరచన సాగుతున్నట్టు తెలుస్తోంది.

08/07/2017 - 03:37

కాకినాడ, ఆగస్టు 6: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన తుని రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం ఘటన మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబీకుల పనేనని మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాపు గర్జన సందర్భంగా జరిగిన ఈ ఘోరం యనమల కుటుంబీకులే చేశారని చెప్పారు.

08/07/2017 - 03:37

విజయవాడ, ఆగస్టు 6: మమతానురాగాలకు, ప్రేమానుబంధాలకు నిదర్శనం రాఖీ పండుగ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. సోమవారం రక్షాబంధన్ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రక్షాకవచంలా ఉంటుందని చంద్రబాబు అభయమిచ్చారు. ఆపదలో ఉన్న మహిళల కోసం అభయహస్తం యాప్‌ను రూపొందించిన విషయాన్ని ప్రస్తావించారు.

08/07/2017 - 03:36

అనంతపురం, ఆగస్టు 6:నిత్య కరవుతో కునారిల్లుతున్న అనంతపురం జిల్లా ఈ ఏడాది కూడా వర్షాభావంతో దారుణంగా దెబ్బతింది. వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్‌లో వేరుశెనగ, కంది, తదితర పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. తొలకరి వర్షాలు ఆశలు రేకెత్తించడంతో రైతులు జూన్‌లో సాగు చేసిన వేరుశెనగ పంట నిలువునా ఎండిపోయింది. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో అదును దాటిపోయింది.. పదును కూడా లేకుండాపోయింది.

08/07/2017 - 03:31

విజయవాడ (క్రైం), ఆగస్టు 6: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు విజయవాడ క్లబ్ ఆర్థిక సాయం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిజిపి నండూరి సాంబశివరావు చేతులమీదుగా క్లబ్ కమిటీ సభ్యులు 23లక్షల రూపాయలు అందచేశారు. మొత్తం 25మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 90వేలు చొప్పున అందించారు.

08/07/2017 - 03:29

రాజమహేంద్రవరం, ఆగస్టు 6: పోలవరం నిర్వాసితులకు పునరావాసం తర్వాతే పనులు చేపట్టాలని ఆందోళన వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు కదులుతున్నా పునరావాసంలో మాత్రం చలనం లేదు. పనులతో పాటు పునరావాసంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తే కాస్తయినా కదలిక వుంటుందని నిర్వాసితులు ఆశిస్తున్నారు.

08/07/2017 - 03:27

విజయవాడ, ఆగస్టు 6: దేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉంది. ట్యాక్సేషన్, ఫైనాన్స్, ఇంగ్లీషు లిటరేచర్, గణితం, ఫిజిక్స్, కంప్యూటర్ సబ్జెక్టులు కలిగిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు, ప్లేస్‌మెంట్ల తీరుతో విసిగిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.

08/07/2017 - 02:44

తిరుపతి, ఆగస్టు 6: చంద్రగ్రహణం కారణంగా సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతామని జెఇఓ శ్రీనివాసరాజు చెప్పారు. ఆదివారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ సోమవారం రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామున 12.48 గంటలకు పూర్తవుతుందన్నారు.

08/07/2017 - 02:13

మంత్రాలయం, ఆగస్టు 6: కర్నూలు జిల్లా మంత్రాలయం క్షేత్రంలో వెలసిన శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ఆదివారం అట్టహాసంగాప్రారంభమయ్యాయి. 346వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణ వేడుకలు పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు సాయంత్రం శ్రీమఠం ముఖద్వారంపై స్వర్ణ బృందావన గోపురం దగ్గర కాషాయ వర్ణం జెండాను ఆవిష్కరించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

08/07/2017 - 02:12

అల్లవరం, ఆగస్టు 6: తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న నలుగురు విద్యార్థినుల జుత్తును కత్తిరించిన ఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కె కీర్తన, లక్ష్మీసౌమ్య, భాగ్యశ్రీ సింధూ శనివారం రాత్రి 9గంటల వరకూ చదువుకుని, వారికి కేటాయించిన గదిలో నిద్రించారు. రాత్రి 11 గంటల వరకూ నైట్ వాచ్‌మన్ ఉన్నాడు.

Pages