S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/06/2017 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఫాతిమా మెడికల్ కళాశాలకు ఎంసిఐ అనుమతి లేకపోయినా 2015-16 సంవత్సరానికి 100 మంది విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేసింది. ఇప్పుడు వారంతా ఓ విద్యా సంవత్సరాన్ని కొల్పోయారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డొనేషన్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది.

08/05/2017 - 03:56

హైదరాబాద్, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ ఎపిపిఎస్‌సి గ్రూప్-3 మెయిన్ పరీక్షల షెడ్యూలును చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ విడుదల చేశారు. గ్రూప్-3 మెయిన్స్ పరీక్షలను 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 6వ తేదీన ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు హైదరాబాద్-1 లోని 135 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబోతున్నట్టు చెప్పారు.

08/05/2017 - 03:55

విజయవాడ, ఆగస్టు 4: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని కార్మికశాఖ మంత్రి కార్యాలయంలో ఇన్స్యూరెన్స్, మెడికల్ సర్వీసు డిపార్ట్‌మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/05/2017 - 03:55

అమరావతి, ఆగస్టు 4: పర్యాటక రంగానికి కొత్త వరవడులు అద్దుతూ, టియు-142 నావల్ మారిటైమ్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంను వచ్చే నెలలో సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇది పర్యాటకంగా విశాఖ సిగలో మరో విశిష్టత వంటిదని, సెప్టెంబర్‌లో ఈ మ్యూజియం పర్యాటకులకు కనువిందు చేయనుందని వివరించారు.

08/05/2017 - 03:55

విజయవాడ, ఆగస్టు 4: మహిళా సాధికారితకు సంబంధించిన అమరావతి డిక్లరేషన్‌కు తుది రూపం ఇవ్వడానికి ఆగస్టు 7న శాసనసభ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో కీలక సమావేశం జరుగనుంది. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని వివిధ అంశాలను చర్చించి, తమ తమ అభిప్రాయాలు తెలియచేయనున్నారు.

08/04/2017 - 03:31

తిరుపతి, ఆగస్టు 3: శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు సులభంగా ఆలయం నుంచి బయటకు వచ్చేందుకు టిటిడి అధికారులు నిచ్చెన మార్గం ఏర్పాటు చేస్తున్నారు. కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు. తమకు సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ శ్రీవారిపైన ఆగమ శాస్త్రాలపైన అచంచలమైన విశ్వాసం ఉన్న భక్తులు టిటిడి ఈ చర్యలపై ఎలా స్పందిస్తారో అర్ధం కాని పరిస్థితి.

08/04/2017 - 03:27

విశాఖపట్నం, ఆగస్టు 3: గత కొంత కాలంగా చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, భారత్ భూ భాగంలోకి చొచ్చుకుని వచ్చి అశాంతికి కారణమవుతోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్ అత్‌వాలే పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనాతో పోరాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

08/04/2017 - 03:24

తిరుపతి, ఆగస్టు 3: తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవిసమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలలో వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.

08/04/2017 - 03:22

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 3: కాంగ్రెస్ అవినీతి రిటైల్ అయితే, నరేంద్ర మోదీ అవినీతి హోల్‌సేల్ అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం అయన విలేఖర్లతో మాట్లాడారు.

08/04/2017 - 03:22

కర్నూలు, ఆగస్టు 3: కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి గురువారం రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి బుధవారం రాజీనామా చేసిన ఆయన వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం నంద్యాలలో జరిగిన బహిరంగసభలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చక్రపాణిరెడ్డి ప్రకటించారు. నైతిక విలువలు, త్యాగాలకు శిల్పా సోదరులు పెట్టింది పేరని అన్నారు.

Pages