S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/07/2017 - 02:11

పొదిలి, ఆగస్టు 6 : రాష్ట్రంలో బిసిలు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ విమర్శించారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాపులు, బిసిల మధ్య విభేధాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడమే జగన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

08/07/2017 - 02:10

విజయవాడ, ఆగస్టు 6: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు భారీగా సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇటీవల ఎంపికైన 518 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఇఇ)కు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందించనున్నారు. నిజానికి వీరందరికీ నెలరోజుల క్రితమే పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది.

08/07/2017 - 01:59

కాకినాడ, ఆగస్టు 6: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అప్రకటిత గృహ నిర్బంధం కొనసాగుతోంది. ఆయన యథావిధిగా ఆదివారం కిర్లంపూడిలోని తన నివాసం నుండి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుండి గేటు వరకు కాపు జెఎసి నేతలతో కలసి పాదయాత్ర చేసేందుకు వెళ్తుండగా సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ముద్రగడ తదితరులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియజేశారు.

08/07/2017 - 00:16

కుప్పం, ఆగస్టు 6: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు క్రమశిక్షణ తప్పుతున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, శాంతికి మరోపేరు తన నియోజకవర్గమైన కుప్పం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు దిమ్మతిరిగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు.

08/07/2017 - 00:15

విజయవాడ, ఆగస్టు 6: ఏపిఎస్ ఆర్టీసీలో మృతుల కుటుంబాలు కారుణ్య నియామకాలు వద్దనుకుంటే అడిషనల్ మానిటరీ బెనిఫిట్ ఫండ్ కింద రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, సెక్రటరీ జనరల్ కె పద్మాకర్, అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

08/07/2017 - 00:15

అమరావతి, ఆగస్టు 6: అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన న్యూట్రిషన్స్ (సూక్ష్మపోషక పదార్థాలు) కంపెనీపై ప్రభుత్వం అపార ప్రేమ చూపింది.

08/07/2017 - 00:14

విజయవాడ, ఆగస్టు 6: పగలనక, రాత్రనక విధి నిర్వహణలో మునిగి తేలుతున్న గ్రామ రెవెన్యూ అధికారులను (విఆర్వో) కంపల్సరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) నుండి మినహాయించి పూర్తిస్థాయి పెన్షన్ విధానం అమలుచేయాలని, సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించాలని ఏపి విఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు.

08/06/2017 - 01:55

అమరావతి, ఆగస్టు 5: టిడిపి ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేరాలన్న వైసీపీ అధినేత జగన్ షరతుతో జనంలో సంపాదించుకున్న ఇమేజి ఎంతోసేపు నిలవలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తొందరపాటు వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారిందని కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. జనం దృష్టిలో తమ పార్టీని ముద్దాయిగా నిలబెట్టాయని పార్టీ నేతలు దిగులుపడుతున్నారు.

08/06/2017 - 01:54

విజయవాడ (పటమట), ఆగస్టు 5: విజయవాడలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన మహిళా డాక్టర్ శనివారం సాయంత్రం కాలువలో శవమై తేలింది. విజయవాడ శివారు నిడమనూరు రైవస్ కాలువ వంతెన వద్ద మహిళా డాక్టర్ మృతదేహం బయటపడింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

08/06/2017 - 01:54

విజయవాడ, ఆగస్టు 5: రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో వివిధ కేటగిరిలకు చెందిన 330 ఉద్యోగాల నియమకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబల్ సబ్ ప్లాన్‌లో భాగంగా, గిరిజనులకు మెరుగైన విద్య అందించేందుకు హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు 270 బోధన, 60 భోధనేతర సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Pages