S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/04/2017 - 00:13

విజయవాడ, ఆగస్టు 3: విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఎపిమెడ్‌టెక్ జోన్ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి జుడిష్‌రాజ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం సిఎస్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. 500 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించినప్పటికీ, 2400 కోట్ల రూపాయలకు టెండరు ఖరారు చేశారని తెలిపారు.

08/04/2017 - 00:13

విజయవాడ, ఆగస్టు 3: కడప జిల్లా ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని టిడిపి కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై కేంద్ర మంత్రి నడ్డాతో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ)తో చర్చించామని తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు 50 మంది విద్యార్థులతో ఢిల్లీలో మంత్రిని, ఎంసిఐ అధికారులను కలిశామన్నారు.

08/04/2017 - 00:12

విజయవాడ, ఆగస్టు 3: నంద్యాల ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తీవ్ర విమర్శలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ వాడిన భాష, ఆయన నేర ప్రవృత్తిని తెలియచేస్తోందన్నారు.

08/04/2017 - 00:11

అమరావతి, ఆగస్టు 3: పార్టీకి తలనొప్పిలా పరిణమించిన జన్మభూమి కమిటీలను రద్దు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీల్లోని సభ్యులు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకోవం వల్ల స్థానికంగా పార్టీకి అప్రతిష్ఠ వస్తున్నందున, వాటిని రద్దు చేయాలని చాలాకాలం నుంచీ బాబుపై ఒత్తిళ్లు వస్తున్నాయి.

08/04/2017 - 00:11

న్యూఢిల్లీ, ఆగస్టు 3: రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు రాని బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రుణాలు ఎలా మంజూరు చేస్తున్నాయని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

08/03/2017 - 02:39

విజయవాడ, ఆగస్టు 2: ఉద్యోగ సంఘాలతో చర్చించి తక్షణమే ఉద్యోగుల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎఎస్ అధికారులు, జ్యూడీషియల్ అధికారులతో పాటు నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. సచివాలయ ఉద్యోగుల ఇళ్లకు సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామన్నారు.

08/03/2017 - 02:38

విజయవాడ, ఆగస్టు 2: రాష్టవ్య్రాప్తంగా చుక్కల భూముల రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చుక్కల భూముల చట్టం తీసుకుని వచ్చిన ప్రభుత్వం, ఆ మేరకు రికార్డుల్లో ఆయా భూ యజమానుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీనిని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

08/03/2017 - 02:38

విజయవాడ, ఆగస్టు 2: అత్యాధునిక టెక్నాలజీతో రేషన్‌కార్డులకు నిత్యావసర సరుకులు అందజేస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం ఆమేర పూర్తి స్థాయిలో మెకానిజాన్ని వృద్ధి చేసుకోలేకపోవటం నిరుపేద తెల్లరేషన్ కార్డుదారుల పాటిట శాపంలా మారుతున్నది.

08/03/2017 - 02:37

అమరావతి, ఆగస్టు 2: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ నగర్- పిఎంఎవై పథకం కింద నిర్మించ తలపెట్టిన పేదల గృహ సముదాయాలను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15 రోజులకు ఒకసారి డ్రోన్ కెమేరాలతో గృహ సముదాయాల నిర్మాణం పనుల పురోగతిని చిత్రీకరించి, తనకు వివరించాలని ఆదేశించారు.

08/02/2017 - 04:35

ఆదోని, ఆగస్టు 1: ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు నీరందించే రాజోలిబండ వివాదం మళ్లీ రాజుకుంది. తెలంగాణ, కర్నాటక ప్రాంతాలకు వెళ్ళే ఎడమ కాలువ స్లూయిస్ వద్ద పూడిక తీత పనులు చేస్తున్నారంటూ సీమ ప్రాంతానికి చెందిన రైతులు మంగళవారం పనులను అడ్డుకున్నారు. గత నాలుగు రోజులుగా రాజోలిబండ వద్ద పూడిక తీత పనులు సాగుతున్నాయి.

Pages