S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/03/2017 - 03:56

అమరావతి, మార్చి 2: మాట ఇవ్వడం.. మడమ తిప్పటం తనకు చేతగాదని, చంద్రబాబులా నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం తనది కాదని ఇప్పటివరకూ ప్రచారం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమ్మినవారిని నట్టేట ముంచారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

03/03/2017 - 03:55

విజయవాడ, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ మల్లాది కృష్ణానంద్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

03/03/2017 - 03:54

అమరావతి, మార్చి 2: పదిమందిని బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై పార్టీ-ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహం, చర్యలపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

03/03/2017 - 03:52

నరసరావుపేట, మార్చి 2: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ రెబల్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులిమి రామిరెడ్డి గురువారం శాసనసభ స్పీకర్ కోడెల తనయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.

03/03/2017 - 03:51

అమరావతి, మార్చి 2: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతోంది. గతంలో టికెట్లు లభించని వారు, ఇప్పటివరకూ జరిగిన ఎంపికల్లో స్థానం దక్కని సామాజికవర్గాలు ఈసారి ఎన్నికల్లో అవకాశం కోసం పార్టీ నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తోపాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

03/03/2017 - 02:31

విజయవాడ, మార్చి 2: శ్రీలంక ప్రాంతీయ మండళ్లు, స్థానిక సంస్థల మంత్రి మహమ్మద్ ఫైజర్ వెలగపూడి సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలనాపరంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను, ఆవిష్కరణలను శ్రీలంకలోనూ ప్రవేశపెట్టేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు సిఎం సానుకూలంగా స్పందించారు.

03/03/2017 - 02:30

విజయవాడ, మార్చి 2: ముప్ఫై తొమ్మిది సంవత్సరాలుగా శాసనసభలో సభ్యునిగా ఉన్నాను.. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా నా అంత సుదీర్ఘకాలం పనిచేసినవారు దేశంలో మరొకరు లేరు.. ఒక రాజధానిని అభివృద్ధి చేశాను, మరో రాజధానిని నిర్మించే బాధ్యతలు తీసుకున్నాను.. వరుసగా రెండు రాజధాని నగరాలను తీర్చిదిద్దే అవకాశం దక్కడం నా సుకృతం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

03/03/2017 - 02:27

శ్రీ కాళహస్తి, మార్చి 2: రెండు తెలుగురాష్ట్రాల్లోని లక్ష మంది దళితులతో తిరుపతిలో మహా భక్తి సంగమాన్ని త్వరలో నిర్వహిస్తామని హిందూ దేవాలయాల పరిరక్షణా కమిటీ అధ్యక్షుడు కమలానంద భారతీ స్వామి చెప్పారు. రథయాత్రపేరుతో 2012 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగురాష్ట్రాల్లో 6800 వేల గ్రామాలను పర్యటించి దళితులకు గ్రామప్రవేశం, ఆలయ ప్రవేశం చేయించామన్నారు.

03/03/2017 - 02:27

తిరుపతి, మార్చి 2: తోటి భక్తురాలిగా నటిస్తూ ఒక వృద్ధ మహిళను నమ్మించి మత్తు మందు ఇచ్చి ఆమె నగలు అపహరించిన సంఘటన తిరుమలలో గురువారం జరిగింది. తిరుమలలో భక్తురాలిగా నటిస్తూ ఒకామె తిరువణ్ణామలైకి చెందిన శాంత, సుబ్రహ్మణ్యం దంపతులతో మాట కలిపింది. తాను మధుమేహానికి మందిస్తానని చెప్పి, భర్తను దూరంగా పంపించి భార్యకు మత్తుమందు ఇచ్చింది.

03/03/2017 - 02:26

తిరుపతి, మార్చి 2: ప్రభుత్వ తీరును ప్రశ్నించిన విపక్ష నేత జగన్‌పై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ వైకాపా నేతలు గురువారం తిరుపతిలో భారీ ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నగరి ఎమ్మెల్యే రోజా తదితరులు తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్‌లో భారీ ధర్నాచేశారు.

Pages