S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/28/2017 - 04:35

గుంటూరు, ఫిబ్రవరి 27: బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వచ్చే బడ్జెట్‌లో రూ. 100 కోట్ల నిధులు కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు కార్పొరేషన్ ఎండి చెంగపల్లి వెంకట్ తెలిపారు. దీనివల్ల నేరుగా 50వేల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనేది తమ లక్ష్యంగా చెప్పారు.

02/28/2017 - 04:34

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: నవ్యాంధ్రలో మెడికల్ పిజి సీట్లు పెరిగాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మేరకు పిజి విభాగంలో 25 సీట్లు పెరిగాయి. మెడికల్ సీట్ల భర్తీకి సంబందించి కేంద్రం నిర్వహించే పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2,700 వరకూ మెడికల్ పిజి సీట్లు అందుబాటులో ఉన్నాయి.

02/28/2017 - 04:34

విజయనగరం, ఫిబ్రవరి 27: ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి.్భవానీ ప్రసాద్ అన్నారు. సోమవారం ఇక్కడ విద్యుత్ భవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఏడాది 4 శాతం, రెండో ఏడాది 3.5 శాతం ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు.

02/28/2017 - 03:11

విజయవాడ, ఫిబ్రవరి 27: చీఫ్ సెక్రటరీ నియామకంపై జరుగుతున్న ఊహాగానాలకు ప్రభుత్వం సోమవారం తెరదించింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అజయ్ కల్లంను చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకూ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఎస్‌పి టక్కర్ రెండుసార్లు పదవీకాలం పొడిగింపు తరువాత మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో సిఎస్‌గా కల్లంను నియమించారు.

02/28/2017 - 03:09

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తమ పార్టీ నుంచి ఎన్నికై టిడిపిలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అటువంటి వారిని కొత్త అసెంబ్లీ భవనంలోకి అనుమతించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద రావును కోరారు.

02/28/2017 - 03:08

కడప, ఫిబ్రవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో కడప జిల్లాలో సోమవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దివ్య తండ్రి ఎరికలరెడ్డి, కడప కార్పొరేటర్ సురేష్‌ను తీసుకెళ్లే వ్యవహారంలో టిడిపి, వైకాపా నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పరస్పరం దాడికి దిగారు.

02/28/2017 - 03:14

ప్రభుత్వాలకు లేని కనికరం కరవుకు ఎందుకుంటుంది? దానికి కబళించడమే తెలుసు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తుంటే కరవు కరాళనృత్యం సాగిస్తోంది. ఆ మాటకొస్తే అనంతపురం కరవు చరిత్రలో ఇదేమీ కొత్త ఘట్టం కాదు..ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే. కాకపోతే, కరవన్నది మచ్చుకైనా లేదని ఢంకా బజాయిస్తున్న పాలకుల కళ్లకు కనబడటం లేదంతే.

02/27/2017 - 04:17

మహానంది, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల స్వామివార్ల రథోత్సవం అశేష భక్తజనుల ఓంకార నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.

02/27/2017 - 04:15

అమరావతి, ఫిబ్రవరి 26: ‘రాష్ట్రంలో రెండున్నరేళ్ల కిందటి కరెంటు కష్టాల గుర్తులు ఇంకా తొలగిపోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది. మారుమూల గిరిజన తండాల్లోనూ విద్యుత్‌ను అందిస్తూ ‘అందరికీ విద్యుత్’ పథకం అమలులో దేశంలోనే ముందున్నాం. పరిశ్రమలకు కోరినంత విద్యుత్తును అందిస్తున్నాం. పంటలకూ ఏడు గంటలపాటు పగటిపూటే నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం.

02/27/2017 - 04:15

సబ్బవరం, ఫిబ్రవరి 26: డబ్బు సంపాదన కోసం న్యాయవాద వృత్తిని వీడొద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. విశాఖ జిల్లా, సబ్బవరంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా-యూనివర్శిటీలో రెండురోజుల పాటు మూట్‌కోర్టు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రమేష్ రంగనాథన్ పాల్గొని, మాట్లాడారు.

Pages