S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/02/2017 - 08:19

విజయవాడ, మార్చి 1: అమరావతి నగరంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలు అత్యున్నతంగా (ఐకానిక్), వాటి ఆకృతులు విలక్షణంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కొత్త రాజధానిలోని ప్రతి కట్టడానికి ఏకరూపత ఉండి తీరాలని బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో నార్మన్ పోస్టర్‌తో జరిపిన ప్రత్యేక సమావేశంలో స్పష్టం చేశారు.

03/02/2017 - 08:18

అమరావతి, మార్చి 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రికార్డు సమయంలో సచివాలయం నిర్మించి పరిపాలన మొత్తాన్ని హైదరాబాద్ నుండి అమరావతికి తరలించిన ప్రభుత్వం.. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను కూడా అమరావతిలో నిర్వహించేందుకు అత్యాధునిక హంగులతో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని పూర్తిచేసింది.

03/02/2017 - 08:16

విజయవాడ, మార్చి 1: రాష్ట్ర విభజన ఉద్యమ నేపథ్యంలో అయిదేళ్లుగా ఆగిపోయిన చలన చిత్ర నంది పురస్కారాల ప్రదానం తిరిగి ప్రారంభమైంది. అత్యుత్తమ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా ప్రకటించే నంది అవార్డులను 2012, 2013 సంవత్సరాలకు సంబంధించి బుధవారం ప్రకటించింది. 2012 సంవత్సరానికి ‘ఈగ’, 2013 సంవత్సరానికి ‘మిర్చి’ చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా బంగారు నందులు సాధించాయ.

03/02/2017 - 05:14

విజయనగరం, మార్చి 1: అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తున్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అగమ్యగోచరంగా మారింది. పొరుగు రాష్ట్రం ఒడిశా పెడుతున్న మడత పేచీల కారణంగా దశాబ్దాల తరబడి ఈ ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఒడిశాతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది.

03/02/2017 - 05:12

గుంటూరు, మార్చి 1: రాష్ట్ర అభివృద్ధి విషయంలో, రాజధాని నిర్మాణం విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా ఆగేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానికి భవిష్యత్తులో ఎప్పటికీ వరద ముప్పు రాకుండా చూస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

03/02/2017 - 05:01

విజయవాడ, మార్చి 1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తికి ప్రభుత్వం బుధవారం షాక్ ఇచ్చింది. కొంతమంది అధికారుల బదిలీలు, నియామకాలను జిఎడికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం ఉత్తర్వులు జారీ చేశారు.

03/01/2017 - 05:00

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 28: నూతన వధూవరులైన ఆది దంపతులు మంగళవారం కైలాసగిరి ప్రదక్షిణ చేసి అతిథులకు సంప్రదాయ రీతిలో వీడ్కోలు పలికారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు, కల్యాణోత్సవానికి విచ్చేసిన రుషులను, మునులను వారి వారి స్వస్థలాలకు చేర్చే ఉత్సవాన్ని రుషిరాత్రి అంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ కాళహస్తీశ్వరాలయానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు.

03/01/2017 - 04:59

శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మంగళవారం ఇక్కడి కలెక్టరేట్‌లో టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేసారు. ఆయనతోపాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషా ఉన్నారు.

03/01/2017 - 04:58

గుంటూరు, ఫిబ్రవరి 28: గుంటూరుజిల్లా చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో బుధవారం నుంచి విశ్వశాంతి సమైక్యతా వేడుకలు జరగనున్నాయి. ప్రతిరోజు గణపతి హోమం, ఏకాదశ రుద్ర పారాయణ, విశిష్ట పూజలు, ప్రత్యేక హోమాలు, పూజాది కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, విశిష్ట వ్యక్తులకు సత్కారాలను నిర్వహిస్తారు.

03/01/2017 - 04:56

విశాఖపట్నం, ఫిబ్రవరి 28: విశాఖ నగర పారిశ్రామిక అవసరాలతో పాటు, ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఏలేరు కెనాల్ నెల రోజుల పాటు మూసివేయనున్నారు. కెనాల్‌ను మార్చి 1 నుంచి 31 వరకూ మూసివేసి సాధారణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం పనులను మూడు రీచ్‌లుగా విభజించి, ఒక్కో రీచ్‌కు డిఇఇ, ఇద్దరు ఎఇలను నియమించారు.

Pages