S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/26/2018 - 23:40

గుంటూరు, నవంబర్ 26: రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీని బలహీనపర్చేందుకే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేయిస్తోందదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ధ్వజమెత్తారు.

11/26/2018 - 23:39

నెల్లూరు, నవంబర్ 26: మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని, దేశంలోనే అగ్రగామిగా రాష్ట్ర మున్సిపల్ శాఖను నిలుపుతామని రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేర్చే క్రమంలో 9.58లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.

11/26/2018 - 23:39

విజయవాడ, నవంబర్ 26: తీర ప్రాంతాల్లో మియావాకి విధానంలో బయోషీల్డ్ ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ప్లానింగ్ విభాగం, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సోమవారం ఆయన మియావాకి విధానంలో మొక్కలు నాటడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని వల్ల తీరం కోతకు గురి కాకుండా నిరోధించే వీలు ఉంటుందన్నారు.

11/26/2018 - 12:48

శ్రీకాకుళం: జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం కెడికెల్ల నుంచి వైకాపా అధినేత జగన్నోహన్‌రెడ్డి పాదయాత్ర కొనసాగింది. ఈ మేరకు విక్రమపురి, చిట్టిపులివలస, నడుకూరు, వీరఘట్టం, చిదిమి మీదుగా వి.వెంకపేట వరకు సాగనున్నది.

11/26/2018 - 12:46

అమరావతి: సూక్ష్మ సేద్యం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన నీరు-ప్రగతిపై టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచ నదుల మహాసంగమమే లక్ష్యం అని అన్నారు. మైక్రో ఇరిగేషన్ ఉత్పాదకత 29శాతం పెరిగిందని అన్నారు. బోట్ రేసింగ్, ఎయిర్ షోతో అమరావతి ఖ్యాతీ పెరిగిందని అన్నారు.

11/26/2018 - 04:07

విశాఖపట్నం, నవంబర్ 25:శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. వందల సంఖ్యలో హాజరైన అయ్యప్ప దీక్షాధారులు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు.

11/26/2018 - 04:05

విశాఖపట్నం, నవంబర్ 25: ఏపీ వైద్య,ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఎంబీబీఎస్ వైద్యుల వయోపరిమితి పెంపు అంశానికి ఏళ్లు గడుస్తున్నాయి. అయినా ఈ సమస్య ఇంకా పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచినా ఇంకా పెండింగ్‌లో ఉండటంతో త్వరలో ఆందోళనకు దిగాలని నిర్ణయించినట్టు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నిర్ణయించింది.

11/26/2018 - 04:05

విజయవాడ, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో 52,67,637 నకిలీ ఓట్లను గుర్తించినట్లు, దీనికి అదనంగా మరో 20 లక్షలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా 34లక్షల 17వేలు డూప్లికేట్, రిపీట్, అక్రమ, చెల్లని ఓట్లు ఉండగా, ఆంధ్ర ఓటర్లు 18లక్షల 50వేల మంది తెలంగాణ ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు.

11/26/2018 - 03:50

రాజమహేంద్రవరం, నవంబర్ 25: జనసేన అధికారంలోకి వస్తే బ్రాహ్మణ సంక్షేమానికి ప్రతీ ఏటా రూ.2500 కోట్లు కేటాయిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజ హితాన్ని కోరే బ్రాహ్మణులు తనను ఆశీర్వదిస్తే బ్రాహ్మణుల కన్నీళ్లు తుడుస్తానన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

11/26/2018 - 03:48

విజయవాడ, నవంబర్ 25: దేశంలో ఏ వ్యవస్థ బాగోగులకైనా కారణం ప్రజలేనని, తన అనుభవం ప్రకారం ప్రతిఒక్కరూ బాధ్యతతో మెలిగితేనే దేశం బాగుపడుతుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు.

Pages