S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/25/2018 - 03:30

విజయవాడ, నవంబర్ 24: దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

11/25/2018 - 03:39

మచిలీపట్నం: రాష్ట్రాన్ని అన్ని విధాలా కొల్లగొడుతున్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఎదుట భూ రక్షణ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

11/25/2018 - 03:27

పోలవరం, నవంబర్ 24: పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నేషనల్ రిమోట్ శాటిలైట్ ఏజెన్సీ డైరెక్టర్ చెంతన్ చౌదరి, రాష్ట్ర అప్లికేషన్ సెంటర్ వైస్ ఛైర్మన్ కెవి రమణలు శనివారం పర్యటించారు. వీరు ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తంలోని కాంట్రాక్టు ఏజెన్సీ కార్యాలయంలో ఇంజినీర్ అధికారులతో ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

11/25/2018 - 03:24

విజయవాడ(సిటీ), నవంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయటంలో టీడీపీ ప్రభుత్వం అలసత్యం వహిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పడు ప్రకటించిన డీఎస్సీ పరీక్షను సత్వరం నిర్వహించకుండా చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు నరకం చూపిస్తోందని శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

11/25/2018 - 03:24

అమరావతి, నవంబర్ 24: రాష్ట్ర సాగునీటి చరిత్రలో నవ శకానికి ప్రభుత్వం నాంది పలుకుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి- కృష్ణా అనుసంధానంతో పవిత్ర సంగమంతో రికార్డు సృష్టించిన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి గోదావరి- పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. నదుల అనుసంధానంతోనే కర వు నిర్మూలన సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

11/24/2018 - 12:48

హైదరాబాద్: తెలుగుదేశం మాజీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన గ్రూప్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై నుంచి వచ్చిన అధికారుల బృందం శుక్రవారం అర్థరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా సుజన గ్రూప్ వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 304 కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు వెల్లడైంది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

11/24/2018 - 12:43

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా తాతాపూడి సమీపంలో 16జాతీయ రాహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరు శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. శబరి మల నుంచి రాజమండ్రికి కారులో వస్తుండగా ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన కుమార్ (31), సారధి (25), సుబ్బారావు(35) అక్కడికక్కడే చనిపోయారు.

11/24/2018 - 07:04

రాజమహేంద్రవరం, నవంబర్ 23: ఆసియా రాజకీయాల్లోనే చంద్రబాబునాయుడు ఒక అవినీతి చక్రవర్తి అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కుంభకోణంపై బీజేపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లిబస్టాండ్ వద్ద శుక్రవారం నిర్వహించిన భూరక్షణ‘దీక్ష’లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

11/24/2018 - 05:16

అమరావతి, నవంబర్ 23: గిరిజన ఉత్పత్తులకు ప్రపంచ మార్కెటింగ్ కల్పిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాథమిక వైద్యం, ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ వెల్లడించారు. అరకు కాఫీకి మంచి గిరాకీ ఉందన్నారు. శుక్రవారం సచివాలయంలో గిరిజన కార్పొరేషన్ స్టాల్స్‌ను, సచివాలయ వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్‌లో అరకు కాఫీ, గిరిజన బిస్కెట్‌లు కొనుగోలు చేశారు.

11/24/2018 - 05:14

మచిలీపట్నం, నవంబర్ 23: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కృష్ణాజిల్లాలోని సాగర తీరాలు జనసంద్రంగా మారాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు మంగినపూడి బీచ్‌తో పాటు సాగర సంగమ క్షేత్రమైన హంసలదీవి బీచ్‌లతో పోటెత్తాయి. మంగినపూడి బీచ్‌కు భక్తులు క్యూ కట్టారు. 2లక్షల మంది పైబడి భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు.

Pages