S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/24/2018 - 05:13

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్రంలో రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీవో)ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో రైతు ప్రగతి, ఎప్‌పీవోల రాష్ట్ర స్థాయి వర్కుషాపును ఆయన శుక్రవారం ప్రారంభించారు.

11/24/2018 - 05:11

విజయవాడ, నవంబర్ 23: ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, తప్పులో కాలేశారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవక ముందు చంద్రబాబును, ఆంధ్రా నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ తిట్టారన్నారు.

11/24/2018 - 05:10

గుంటూరు, నవంబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్) జాతీయ వైస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడారు.

11/23/2018 - 04:51

రాజమహేంద్రవరం, నవంబర్ 22: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి దమ్ముంటే తన ఆస్తులను వెల్లడించాలని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సవాల్ విసిరారు. జగన్‌కు బెంగుళూరులోని ఆస్తులు, హైదరాబాద్‌లో లోటస్ పాండు తదితర ఆస్తులను వెల్లడించే సత్తాలేదన్నారు.

11/23/2018 - 04:51

విజయవాడ, నవంబర్ 22: నిరుద్యోగులకు భృతి చెల్లించే ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అర్హుల లెక్క నాలుగు లక్షలు దాటింది. ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకునేలోగా 20 వేల మందిని వివిధ కంపెనీల్లో అప్రంటీస్‌గా చేర్చి, ఆన్‌జాబ్ శిక్షణ ఇవ్వాలని అధికారులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు.

11/23/2018 - 04:50

తిరుపతి, నవంబర్ 22: భక్తకోటిలో జ్ఞాన జ్యోతిని వెలిగించడమే కార్తీక దీపోత్సవ పరమార్థమని, కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించే కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా చేపట్టినట్లు టీటీడీ ఈ ఓ ఏకే సింఘాల్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు తిరుమల క్షేత్రంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయ బద్దంగానిర్వహించారు.

11/23/2018 - 04:49

రాజమహేంద్రవరం, నవంబర్ 22: గోదావరి నది తీరం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువారం దేదీప్యమానంగా కాంతులీనింది. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది స్నాన ఘట్టాల్లో అశేష భక్తజనం పవిత్ర గోదావరి నదికి కార్తీక దీప నీరాజనం పలికారు. రాజమహేంద్రవరంలోని పురాణ ప్రాశస్థ్యం కలిగి, ఆసియాలోనే అతి పెద్ద ఘాట్‌గా పేరొందిన స్థానిక కోటిలింగాల ఘాట్‌లో కిలోమీటరున్నర పొడవున మహిళలు లక్ష దీపారాథన నిర్వహించారు.

11/23/2018 - 03:54

నెల్లూరు/చిత్తూరు, నవంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి గత రెండు రోజుల నుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 48 గంటల్లో నెల్లూరు జిల్లాలో గూడూరు, దొరవారిసత్రం మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 76.9 మి.మీ గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

11/23/2018 - 01:24

పుట్టపర్తి, నవంబర్ 22: సమాజాభివృద్ధికి విద్య, శాస్తవ్రిజ్ఞానం ఎంతో దోహదకారి అని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శి, డీఐఆర్‌ఏసీ అధ్యక్షురాలు రేణుస్వరూప్ పేర్కొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 37వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా జరిగింది.

11/23/2018 - 01:22

తిరుపతి, నవంబర్ 22: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆభరణాలను గురువారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించారు. 15 రోజులపాటు ఈ పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాములవారి మేడ సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో ఆభరణాలను పరిశీలించే కార్యక్రమం ఆనవాయితీగా సాగుతోంది.

Pages