S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/22/2018 - 23:58

భద్రాచలం టౌన్, నవంబర్ 22: కేంద్రంలో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అటువంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఆమె అన్నారు.

11/22/2018 - 23:57

విజయవాడ, నవంబర్ 22: రాజధాని అమరావతి పరిధిలో మరో 6 సంస్థలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్యక్షతన భూముల కేటాయింపునకు సంబంధించి మంత్రి మండలి ఉపసంఘం సమావేశం గురువారం జరిగింది.

11/22/2018 - 23:56

ఒంగోలు, నవంబర్ 22: ఒంగోలులోని పాపారైస్ మిల్లు వద్ద ఉన్న హనితా ఎంటర్ ప్రైజెస్ గోదాములో గురువారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ అయి గోదాములోని ప్లాస్టిక్ వ్యర్థాలు దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా.

11/22/2018 - 23:55

చిత్తూరు, నవంబర్ 22: రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలశాఖామంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. గురువారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రాష్ట్రం పారిశ్రామికంగా ఎదుగుతూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్రం కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు.

11/22/2018 - 23:55

విజయవాడ, నవంబర్ 22: ప్రజల సహకారంతోనే హరితాంధ్రప్రదేశ్ సాధ్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఈ నెల 23 నుంచి 29 వరకూ కార్తీక వనమహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. అనంతపురం జిల్లా మారాల రిజర్వాయరు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్తీక వనసమారాధన కార్యక్రమంతో వన మహోత్సవాల కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

11/22/2018 - 16:56

తిరుమల: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురిసింది. వేకువ జాము నుంచే భారీ వర్షం కురవటంతో తిరువీధులు జలమయమయ్యాయి. దాదాపు 15 సెంమీ వర్షం పడింది. కనుమ దారిలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడ్డాయి.

11/22/2018 - 12:36

హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ఊపందుకోవటంతో బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈనెల 27న ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలోని నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గోనున్నారు. అలాగే అమిత్ షా ఈనెల 24 రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుని వరుసగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు.

11/22/2018 - 12:33

తిరుమల: శ్రీవారి ఆభరణాలను గురువారం నుంచి ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించనున్నది. శ్రీవారి ఆలయంలోని రాములవారి మేడ సమీపంలో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి దాదాపు 15 రోజుల పాటు ప్రత్యేక అధికారుల బృందం పరిశీలన చేయనున్నది.

11/22/2018 - 04:24

గుర్రంకొండ, నవంబర్ 21: గతంలో కాంగ్రెస్ హయాంలో పార్లమెంటులో చట్టం తెచ్చిన అంశాలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ, గుర్రంకొండలో ఆయన పర్యటించారు. గుర్రంకొండలోని కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, అత్మీయులు పలకరించారు.

11/22/2018 - 04:22

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వాంగ్మూలం కోరుతూ సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద జారీ చేసిన నోటీసులపై ఈ నెల 27 తరువాత స్పందిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టం చేశారు. ఘటనపై జగన్ వాంగ్మూలాన్ని ఈ నెల 23లోగా ఇవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే.

Pages