S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/15/2018 - 02:15

నల్లచెరువు, నవంబర్ 14: రైతుకు పరిహారం చెల్లించేందుకు ఏకంగా తహసీల్దార్ కార్యాలయానే్న వేలం వేసిన సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో బుధవారం జరిగింది. కదిరి డివిజన్‌లోని నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని కదిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం వేలం వేశారు. రూ.10.20 లక్షలకు దీన్ని ఓ వైకాపా నేత సొంతం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

11/15/2018 - 02:14

విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలోని వివిధ మంచినీటి ప్రాజెక్టులను కిసాన్ రాజా యాప్ ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టును కృష్ణా జిలాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

11/15/2018 - 02:13

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారని, సబ్-కాంట్రాక్టులిచ్చి కమిషన్లు దండుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నూటికి నూరు శాతం నిధులు కేంద్రానివేనన్నారు.

11/15/2018 - 02:12

తాళ్లపూడి, నవంబర్ 14: రాష్ట్రాన్ని జగన్, పవన్ అనే దుష్టగ్రహాల నుండి రక్షించాలని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సత్తాగల చంద్రబాబునాయుడే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ బుధవారం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు.

11/14/2018 - 06:39

అమరావతి, నవంబర్ 13: ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులు స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పౌరసఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నతాధికారులు మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

11/14/2018 - 06:38

భీమవరం, నవంబర్ 13: హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేశాయని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు జి ప్లస్-3 కేటగిరీలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ ఇళ్లు దేశంలోనే మోడల్ ఇళ్లుగా మారతాయన్నారు.

11/14/2018 - 06:33

విజయనగరం, నవంబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుపెట్టుకొని, కాంగ్రెస్‌తో జతకట్టి ఆంధ్రా ద్రోహిగా మారారని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోధర్ ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఒనగూరేది ఏది లేదని చెప్పిన చంద్రబాబునాయుడు నేడు మాట మార్చి ప్రత్యేక హోదా కావాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

11/14/2018 - 06:33

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోకపోయినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడటం లేదంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆక్షేపించారు. దుబాయ్‌లో టీడీపీ ఎన్నారై సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఐటీ రంగం ఎవరి హయాంలో అభవృద్ధి చెందిందో అక్కడి ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు.

11/14/2018 - 06:32

రాజమహేంద్రవరం, నవంబర్ 13: పదవ తరగతి సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆయా కేంద్రాల్లో అన్ని వసతులతో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని విద్యా శాఖ కమిషనర్ కె సంధ్యారాణి చెప్పారు. రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా కమిషనర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

11/14/2018 - 06:31

దర్శి, నవంబర్ 13 : ప్రకాశం జిల్లా కురిచేడు ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ బ్యాంకు పంట రుణాల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన బ్యాంకు మేనేజర్ మహాదేవ్ గౌతమ్ పద్మరాజుతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డియస్‌పి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Pages