S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/20/2018 - 04:06

అమరావతి, నవంబర్ 19: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు స్వచ్ఛంద సేవా సంస్థలకు అప్పగించినప్పటికీ పనిచేసే కార్మికులను తొలగించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఉండవల్లి ప్రజా వేదికలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.

11/20/2018 - 02:50

తిరుపతి, నవంబర్ 19: సీబీఐ పరిస్థితి నేడు పిచ్చోడి చేతిలో రాయిలా మారి విశ్వసనీయతను కోల్పోయిందని ఎపిఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య ఆరోపించారు. సోమవారం తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీబీఐ సమ్మతి ఉత్తర్వుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం సరైన నిర్ణయమని చెప్పారు.

11/20/2018 - 02:49

విజయవాడ, నవంబర్ 19: అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమిత్‌షా కొడుక్కి కట్టబెట్టడానికి, ఆ సంస్థ డిపాజిటర్లను నిలువునా ముంచేయడానికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు.

11/20/2018 - 02:46

విజయవాడ, నవంబర్ 19: పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లా కేంద్రంలోనూ సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం ఐటీ శాఖ అధికారులతో సైబర్ సెక్యూరిటీపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీకి డిమాండ్ పెరుగుతోందన్నారు.

11/20/2018 - 02:41

విజయవాడ, నవంబర్ 19: బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహరావు గల్లీ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారని, మతి ఉండి మాట్లాడుతున్నారో... మతి భ్రమించి మాట్లాడుతున్నారో వారు సమాధానం చెప్పాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు.

11/20/2018 - 02:41

విజయవాడ, నవంబర్ 19: 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1100 వైద్యులను నియమించనున్నట్లు రాష్ట్ర వైద్య మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించేలా తరచూ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

11/19/2018 - 05:46

విజయవాడ (సిటీ), నవంబర్ 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలలుగన్న ఫార్ములా-1 రేస్ పోటీలు నేడు అమరావతిలో సాకారమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి వైపు పారిశ్రామికేవేత్తలు చూస్తున్నారని, త్వరలోనే అమరావతి ముందు వరుసలో నిలవనుందన్నారు.

11/19/2018 - 05:38

అమరావతి, నవంబర్ 18: దేశవ్యాప్తంగా బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.

11/19/2018 - 05:45

ఆదోని, నవంబర్ 18: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కలయిక అపవిత్రమని కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో ఎందుకు జతకట్టాల్సి వచ్చిందో బాబు స్పష్టం చేయాలన్నారు. కాపు, బలిజల రిజర్వేషన్‌పై సీఎం అబద్దాలు చెబుతూ నాటకాలు ఆడుతున్నారన్నారు.

11/19/2018 - 05:36

ఖమ్మం, నవంబర్ 18: ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రధానంగా వైరా, మధిర, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట అభ్యర్థుల ఎంపికపై ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మొదట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తరువాత పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని అన్నిచోట్ల నేతల్లో ఉన్న అసంతృప్తిని చల్లబర్చినా వైరాలో మాత్రం అది సాధ్యం కాలేదు.

Pages