S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/18/2017 - 00:18

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకన్నా ఎక్కువగా జీతాలు ఇస్తామని, కానీ ఓపికపట్టాలని దసరా సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, ఉద్యోగ సంఘాలు తమ కోర్కెల చిట్టా విప్పడం చూశాము. నిజానికి కొత్తరాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంది. ఉద్యోగులకు జీతాలు పెంచడం తప్పుకాదు. కానీ అమాంతం, భారీ మొత్తంలో పెంచాల్సిన అవసరమేమిటి?

10/17/2017 - 00:04

రాష్టవ్య్రాప్తంగా అవినీతి అధికారులపై ఆకస్మిక దాడులు జరిపి భారీగా అవినీతి సొమ్మును పట్టుకుంటున్న ఎసిబి అధికారుల చర్యలు సమంజసం. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా ఇటీవలి కాలంలో పెద్దపెద్ద అవినీతి తిమింగలాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టుకోవడం మేలైన పరిణామం. ఎసిబి అధికారులు చిత్తశుద్ధితో ఇలాగే వ్యవహరిస్తే అవినీతికి అలవాటుపడిన అధికారుల్లో కొంతలో కొంతైనా భయం కలుగుతుంది.

10/16/2017 - 01:03

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సాగుతున్న ప్రకటనలు యుద్ధోన్మాదాన్ని చాటుతున్నాయి. ఆయా దేశాల వైఖరి, ప్రకటనలు మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. ఈమధ్యకాలంలో చైనా దుందుడుకు వైఖరి యుద్ధ వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ప్రపంచంలోని దేశాలన్నీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూంటే ఒకటి రెండు దేశాలు యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాయి.

10/14/2017 - 00:45

తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మైనర్ బాలిక ఆరుషి హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పు సిబిఐ సంస్థకు చెంపపెట్టు. క్రింది కోర్టు దోషులుగా నిర్ధారించిన ఆరుషి తల్లిదండ్రుల్ని సంశయలాభం ప్రాతిపదికన హైకోర్టు విడుదల చేసింది. అంటే నేరం నిరూపించే విషయంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయన్న మాట. ఒక నేర పరిశోధనకు అవలంబిచాల్సిన శాస్ర్తియ పద్ధతులు పాటించలేదన్నమాట.

10/13/2017 - 00:52

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం పేరిట జరుగుతున్న ఆర్భాటానికి అర్థం లేదు. రెండేళ్ల నుంచి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు వచ్చివెళ్లడం, ప్రతిపాదనలు, ప్లాన్‌లు అందచేయడం, మళ్లీ కొత్త బృందాలకు పని అప్పగించడం వంటి పనులవల్ల ఎంతో ఖర్చు అవుతోంది. ఖజానాలో నిధులు లేవంటున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ సినీ దర్శకుడు రాజవౌళితో చర్చలు జరపడం ఎందుకు? ఆయనను విమానంలో రప్పించడం ఎందుకు?

10/11/2017 - 19:37

మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్న రోహింగ్యా ముస్లింలను మన దేశం నుంచి పంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓట్ల కోసం వారికి పునరావాసం కల్పించాలని, భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పక్షాలకు బుద్ధి చెప్పాలి. రోహింగ్యాలకు మద్దతుగా మనదేశంలోని ముస్లింలు ర్యాలీలు చేయడం, వామపక్షాలు మద్దతు ఇవ్వడం దేశభద్రతకు ముప్పు తేవడమే.

10/11/2017 - 00:36

సామాన్య పౌరుల బలహీనతల ఆసరాగా దొంగబాబాల ఆటలు సాగుతున్నాయి. డేరాబాబా, ఫలహార్ బాబా వంటి వారి బయటకు వచ్చాయి. కానీ ఎక్కడికక్కడ దొంగబాబులు ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. నిజమైన బాబాలు, స్వామీజీలు చెప్పే ప్రవచనాల్లో మంచిని స్వీకరిస్తే చాలు. ప్రజలు వారిని గమనించి అనుసరించాలి. అంతేగానీ వారు చేసే మాయలు చూసి నమ్మితే మోసపోకతప్పదు.

10/09/2017 - 23:04

ఒక వర్గాన్నో, మతాన్నో లక్ష్యంగా చేసుకుని కుత్సిత విమర్శలు చేసేవారు ఎంత ఉన్నత విద్యలు అభ్యసించినా, మేధావి అనిపించుకోలేరు. విద్య వినయానే్న నేర్పుతుందని చెబుతారు. కానీ విద్యాధికుడు కంచ ఐలయ్య ప్రచురించిన పుస్తకాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొందరు స్వాములు, కొన్ని వర్గాలపై ఆయన కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. చర్చాగోష్ఠిలో స్వామీజీ దీటైన సమాధానం చెప్పకుండా మధ్యలో వెళ్లిపోవడం బాధాకరం.

10/07/2017 - 00:47

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలు ఎన్నో కష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మురికి కాలువల వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో పరిస్థితిని అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీడియా కూడా అక్కడి అవస్థలను వెలుగులోకి తెస్తోంది. అడ్డగుట్ట ప్రాంతంలో అంతకంటే తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.

10/06/2017 - 01:12

భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమ్మభాషకు దక్కిన గౌరవంగా భావించాలి. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలన్న నిర్ణయంవల్ల ఎంతో మేలు జరుగుతుంది. మార్కులు, ఉద్యోగ అవకాశాల ఆశలతో తెలుగును కాదనుకుని ఇతర భాషలవైపు మొగ్గు చూపుతున్న విద్యార్థులు ఇక తెలుగును నేర్చుకోవలసి ఉంటుంది.

Pages