S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/09/2016 - 00:48

నల్లధనాన్ని నియంత్రించేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ దేశంలో నల్లధనాన్ని అంతం చేయడం అసాధ్యమని ఇదివరకే రుజువైంది. గతంలోనూ రెండు సందర్భాల్లో పెద్దనోట్లను రద్దు చేసినా నల్లధనం సమస్య సజీవంగానే ఉంది. అప్పట్లో పెద్దనోట్లను అత్యధిక శాతం ధనికులు వాడుకొనేవారు, దాచుకునేవారు. పెద్దనోట్లను గతంలో రద్దు చేసినపుడు సామాన్య జనం ఎలాంటి కష్టాలు పడలేదు.

12/08/2016 - 05:20

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తే చాలు తల్లిదండ్రుల్లో అలజడి పుడుతోంది. స్నేహితులతో సరదాగా సెలవురోజులు గడుపుదామని విద్యార్థులు చెరువులు, నదుల వద్దకు, బీచ్‌ల వద్దకు వెళుతూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ఈత రాక మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెల్ఫీల మోజుతో కొందరు మృత్యువాత పడుతున్నారు.

12/07/2016 - 02:52

మన దేశ జనాభాలో 96 శాతం మంది హిందువులున్నారని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి హిందువులు 50 శాతం మంది మాత్రమే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీరు 20 శాతం ఉన్నారు. కేరళ, మణిపూర్, మేఘాలయాల్లో చాలామంది తక్కువ హిందువులున్నారు. మతం మార్చుకుంటున్న హిందువులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు. హిందువుల్లో నిరుపేదలు, నిరుద్యోగులు, వ్యాధిపీడితులు మతం మార్చుకొంటున్నారు.

12/05/2016 - 23:32

చిన్ననోట్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలపై ఉంది. ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లను తగినన్ని ముద్రించి విడుదల చేస్తే చిల్లర సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారస్థులు గతంలో తమకు వచ్చిన చిల్లర నోట్లను ఏరోజుకారోజు బ్యాంక్‌లలో డిపాజిట్ చేసుకునే వారు. అప్పుడు చిల్లర కొరత ఉండేది.

12/04/2016 - 22:44

ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు, తెలుగునాట పుట్టి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి భారతదేశానికి సంగీత సామ్రాట్టుగా ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టిన మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉండవలసింది. కనీసం తమిళనాడు ప్రభుత్వం కాని, రెండు తెలుగురాష్ట్రాలు గాని, వారి తరఫున మంత్రులు గాని హాజరై ఉంటే ఎంతో గౌరవంగా, హుందాగా వుండి వుండేది. ఇది ఆయన ఆత్మను అగౌరవపరచినట్లయింది.

12/02/2016 - 22:55

500, 1,000 రూపాయల కారణంగానే దేశంలో కొంతమంది నల్లధనాన్ని విపరీతంగా పోగు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసంతో కూడినది. పెద్దనోట్లను పేదలు ఎప్పుడూ దాచుకోలేరు. వారి వద్ద నల్లధనం ఉండే అవకాశం లేనే లేదు. పాతనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది గనుక భయాలు అనవసరం. భారీగా నోట్లను నిల్వ చేసుకునే వారికే ఆందోళన ఎక్కువ.

12/01/2016 - 23:06

దేశవ్యాప్తంగా సినీ థియేటర్లలో ‘జనగణమన’ జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. పౌరులందరికీ దేశభక్తి ఉండాల్సిందే. అయితే, సినిమా హాళ్లలో జాతీయగీతాలాపన చేసినంత మాత్రాన దేశభక్తి సాధ్యమా? ఇది ఒక ప్రహసనంగా మారే ప్రమాదం ఉంది. గతంలో సినిమా ముగిసే ముందు జాతీయగీతాలాపన ఉంటే అంతా బయటకు వెళ్లిపోయేవారు.

12/01/2016 - 06:24

గతంలో వెయ్యి రూపాయల నోటుకే చిల్లర లభించక వినియోగదారులు నానా ఇబ్బంది పడేవారు. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేశాక ఆర్‌బిఐ విడుదల చేసిన 2,000 రూపాయల నోటుతో ప్రజలు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. చేతిలో 2వేల రూపాయల నోటున్నా ఏదీ కొనుక్కోలేని దుస్థితి దాపురించింది. చాలా ఎటిఎంలలో 2వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఈ నోటుతో చిల్లర సమస్య దారుణంగా మారింది.

11/29/2016 - 23:29

ఎపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని హాస్యాస్పదంగాను, విస్మయం కలిగించేవిగాను ఉంటున్నాయి. వాటిని పరిశీలిస్తే- విశాఖ బీచ్‌లో తెరలుకట్టి ప్రేమికులను ఆహ్వానిస్తుందట ప్రభుత్వం! చాలా దేశాల నుంచి ప్రేమికులు కూడా వస్తారట. అన్నిరకాల ‘ఆధానా’లకు అవకాశాలు ఉంటాయట. ఇక, విజయవాడలో కాసినోలు (జూదగృహాలు) రాబోతున్నాయట. లాస్‌వెగాస్‌లోని కాసినోల్లో జూదరులను ప్రోత్సహించే అమ్మాయిలు కూడా ఉంటారు.

11/29/2016 - 07:08

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతగా ప్రగతి సాధించినప్పటికీ సమాజంలో ఇంకా అనేక మూఢాచారాలు కొనసాగుతున్నాయి. జంతుబలుల్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఏనాడో చట్టం చేసింది. ఈ చట్టంపై అధికారులు ఎలాంటి ప్రచారం చేయడం లేదు. జాతరలు, గ్రామదేవతల పండుగల సందర్భంగా మూగజీవాలను పెద్దఎత్తున బలి ఇస్తున్నారు. సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థలు, జీవకారుణ్య సంఘాల వారు జంతుబలుల నిషేధానికి ఉద్యమించాల్సి ఉంది.

Pages