S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/03/2016 - 03:50

ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక సంస్థల కృషి ఫలితంగా ఎట్టకేలకు హెచ్‌ఐవి, ఎయిడ్స్ నియంత్రణ ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం హర్షదాయకం. దేశంలో మొత్తమీద ఎయిడ్స్, హెచ్‌ఐవి రోగగ్రస్తులలో 55 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ రాష్ట్రాలలో వ్యాధిగ్రస్తుల ఉపశమనానికి తీసుకునే చర్యలు నామమాత్రంగా వున్నాయి. రోగుల పట్ల వివక్ష, నిర్లక్ష్యభావం కనబరిచే వైఖరి ఎక్కువగా వుంది.

11/02/2016 - 08:28

రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి ప్రకటన చేసి ఇపుడు ద్వంద్వవైఖరి అవలంబిస్తోంది. ప్రత్యేకహోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలన్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట మార్చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలను విమర్శిస్తున్నది. వైకాపా, కాంగ్రెస్ వారు ఎందుకు చేస్తున్నారు?

11/01/2016 - 07:13

తెలంగాణలో దాదాపు అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లలో మరుగుదొడ్లు అపరిశుభ్రతతో ప్రయాణీకుల్ని హడలెత్తిస్తున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణపై అధికారులకు ఎలాంటి శ్రద్ధ లేనందున బస్ స్టేషన్లలో నిలబడాలంటేనే భయం వేస్తుంది. గతిలేక ఈ మరుగుదొడ్లను వాడుతున్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. బస్సుల కోసం నిరీక్షించే వారు దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారు.

10/29/2016 - 04:34

హిందూ మతాన్ని బౌద్ధ మతం కబళించే స్థితిలో ఆదిశంకరాచార్యుల వారు ఉద్భవించి, ఆ మతాన్ని భారతదేశం నుండి తరిమికొట్టి మళ్లీ అది ప్రవేశించకుండా నాలుగు దిక్కులా పీఠాలను స్థాపించారు. బౌద్ధ మతానికి వేదాలతో పనిలేదని ఆయన భావించారు. ఈ కారణంగానే హిందూ మతం సుస్థిరంగా ఉండాలని పీఠాలను స్థాపించి భారతీయులను సమైక్యపరిచారు. ‘వేదం వేరు, హిందూ మతం వేరు’ అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదు.

10/27/2016 - 23:48

మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేలా కళలను పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నట్టు ఎపి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం స్వాగత పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో కూచిపూడి, భరతనాట్యం ఉపాధ్యాయుల నియామకానికి వచ్చే డిఎస్‌సిలో ప్రకటన జారీ చేస్తున్నట్టు వెల్లడించడం సంతోషదాయకం.. అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి.

10/27/2016 - 03:36

ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీమ్, సిరిసిల్లకు రాజన్న , భూపాలపల్లికి జయశంకర్ పేరిట తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. దేశదేశాల్లో కీర్తి గడించిన తెలుగుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ప్రభుత్వం విస్మరించడం విచారకరం. ప్రధానిగా, నూతన ఆర్థిక విధానాల రూపకర్తగా, ముఖ్యమంత్రిగా, బహుభాషావేత్తగా కీర్తి శిఖరాలను అందుకున్న పీవీని గతంలో కాంగ్రెస్ పార్టీ విస్మరించింది.

10/26/2016 - 07:27

సూర్యాపేట మున్సిపాలిటీని ‘బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత పట్టణం’గా గుర్తించి- ఈనెల 1వ తేదీన మునిసిపల్ చైర్‌పర్సన్ దిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు. కాగా, సూర్యాపేటలో లక్షకు పైగా జనాభా ఉన్నా ఒక్కటైనా పబ్లిక్ మూత్రశాల లేదు.

10/24/2016 - 23:55

ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు మసూద్ అజహర్‌ని ఉగ్రవాదిగా ప్రకటించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐరాసలో భారత్ తీర్మానిస్తే చైనా మాత్రం ‘వీటో’ చేసింది. ఇప్పుడు అదే చైనాకు చెందిన అధికార ప్రతినిధి- సీమాంతర ఉగ్రవాదంపై ప్రపంచం గట్టిగా స్పందించాలని న్యూయార్క్ సదస్సులో గంభీర ఉపన్యాసం చేయడం విడ్డూరం. చైనా డ్రాగన్‌కి రెండు తలలు, రెండు నాలుకలు!

10/24/2016 - 06:51

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హిందూ సంస్థల సానుభూతిపరులు వరుసగా హత్యలకు గురికావటం చూస్తుంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లయినా లేదనిపిస్తోంది. ఈ రాష్ట్రాలలో హిందువుల ఐక్యతకు, రక్షణకు పాటుపడుతున్న వారిని అంతం చేయటం గత దశాబ్దకాలంగా పెచ్చరిల్లిపోయింది. వీటిని సాధారణ హత్యలుగా భావించకుండా ఒక మతం పట్ల వైరంతో కూడి చేస్తున్నవిగా భావించాలి.

10/22/2016 - 01:35

వేల కోట్ల రూపాయల మేరకు వివిధ రాష్ట్రాల ప్రజలను మోసగించిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూముల వివరాలను ప్రభుత్వం బహిరంగ పరచాలి. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం తదితర సమాచారాన్ని ప్రకటించి, ఆ సంస్థకు చెందిన అన్ని స్థిరాస్తులను విక్రయించి బాధితులకు న్యాయసమ్మతంగా నష్టపరిహారం పంపిణీ చేయాలి. ఆక్రమణ దారులు, బినామీల నుండి ఈ భూములను సంరక్షణ చేసి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.

Pages