S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/15/2016 - 05:59

కళాశాలలో చేరిన విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం పరమ కిరాతక చర్య. ఆనవాయితీ చర్య. ర్యాగింగ్ అనేది పైశాచిక క్రీడ. శాడిస్టుల పని. విద్యార్థులకు అవమానం కల్గిస్తుంది. బాధ, భయం, భీతి, దిగులు కల్పిస్తోంది. సామాజిక ఆమోదం లేని పనులకు రాక్షస రూపం ర్యాగింగ్ ప్రక్రియ.

08/14/2016 - 05:13

భారత్ క్రియాశీల దౌత్యం కారణంగా క్రమంగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నది. ఆగస్టు 3,4 తేదీల్లో ఆ దేశంలో జరిగిన దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ ఏడవ సమావేశం ఈ అంశాన్ని స్ప ష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశంలో పాల్గొన్న మన హోంశాఖమంత్రి రాజనాధ్‌సింగ్ ఎంతో దృఢం గా, స్పష్టంగా పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల అనుసరిస్తున్న నేరపూరిత ధోరణిని ఆ దేశం గడ్డమీదే ఖండించారు.

08/13/2016 - 02:33

కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీగారు అభివృద్ధి చెందిన దేశాలలో కంటే మన దేశంలో బ్యాంకు, పోస్టల్ పొదుపుపై వడ్డీ ఎక్కువని పొదుపుపై వడ్డీలు తగ్గిస్తే పరిశ్రమలకు ప్రయోజనమని అభిప్రాయపడ్డారు. కాని అభివృద్ధి చెందిన దేశాల సగటు ఆదాయంలో మనకు పదోవంతు లేదు. సంస్కరణల అమలు వల్ల కొన్నివర్గాల ఆదాయం పెరుగుతున్నా అత్యధిక శాతం ప్రజల ఆదాయం పెరగటం లేదు.

08/11/2016 - 23:16

ఈదేశంలో అత్యంత పీడిత జాతులకు చెందిన వారు దళితులు. ఈ దేశ మూలవాసులు. మొదట్నుంచీ తాము అంటరానివారిగా ముద్రవేయబడి పీడనకు, సామాజిక వేదనకు గురిచేయబడినవారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వీరు యాభైతొమ్మిది కులాలుగా విభజింపబడ్డారు. అం దులో మాల, మాదిగ కులాలకు, ఉపకులాలకు చెందినవారే అత్యధిక సఖ్యలో ఉన్నారు. ఈ కులాల్లోంచి వచ్చినవాడే అంబేద్కర్. భారతరత్న, పీడితజాతుల తాత్వికుడు.

08/11/2016 - 23:14

తెలంగాణ రాష్ట్రంలోని సంచార జాతులకు సంబంధించిన కులాలవారు అభివృద్ధి ఫలాలు అందక ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. ఈ కులాల వారు అనాదిగా అడవులు, ప్రకృతి సిద్ధమైన వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. అమాయత్వం, నిరక్షరాస్యతతో అభివృద్ధికి ఆమడదూరంలో వుంటూ కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కులాలు 36 ఉన్నట్టు విముక్త సంచార జాతులుగా (డీనోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్)గా గుర్తించారు.

08/11/2016 - 05:33

బంజారాలు అత్యంత భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకుంటారు. పూర్వం తండాలలో కాలం కాకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని పెళ్లికాని యువతులతో ఈ తీజ్ పండగ నిర్వహించేవారట. తీజ్ పండగలో ముఖ్యపాత్ర వహించే పెళ్లికాని యువతులకు మంచి లక్షణాలుగల వరుడు లభించి వివాహం అవుతుందని విశ్వాసం. కాలక్రమేణా ఈ తీజ్ పండగ పెళ్లికాని యువతులకు మంచి భర్తకోసమే చేసే పండగగా మారిపోయినది.

08/11/2016 - 05:30

మానవుని ఇంద్రియాలు బైటి జ్ఞానాన్ని మాత్రమే మెదడుకు అందచేస్తుంటాయని మనందరం అనుకుంటాం. అవే ఇంద్రియాలు మనిషి మెదడులోని ఆలోచనను కూడా తమ కదలికల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేస్తుంటాయి. చూడటం, పరిశీలించటం అనేది రెండు ప్రక్రియలు. ఈ రెండూ కళ్లే చేస్తాయి. ఆ చూపులోనే ఈ రెండింటి తేడా అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒక దృశ్యాన్ని చూస్తాం. కానీ కొన్నింటిని పరిశీలిస్తాం.

08/10/2016 - 00:11

భారత్‌లో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుం ది. ఇది మన భారత రాజ్యాంగం కల్పించింది. తనకు ఇష్టమైన వ్యక్తికిగాని పార్టీని గాని ఓటు చేయడం ద్వారా ఓటరు తన హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాజ్యాంగం ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోమని ఆదేశిస్తోంది. దేశంలో బహుళ రాజకీయ పార్టీలున్నాయి. ఓటర్లు తమకిష్టమైన రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. నమ్మిన వ్యక్తిని గెలిపిస్తున్నారు.

08/10/2016 - 00:09

బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థిరత్వం మీద తాజాగా భారత రిజర్వు బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన పత్రంలో ఆ రంగానికి పొంచి వున్న ముప్పుపై హెచ్చరించింది. ఒక్క భారతరదేశమే కాదు ప్రపంచమంతటా ఆర్థికాభివృద్ధి ఒడుదుడుకులకు లోనవుతోంది. ఆర్థిక మాంద్యం నుంచి కొన్ని దేశాలు బయటపడగా మరికొన్ని దేశాలు కోలుకోవడం ఆలస్యమవుతోంది.

08/08/2016 - 23:45

వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది.

Pages