S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/30/2018 - 00:12

వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీని నిర్వహిస్తున్నట్లు జాగృతి వారపత్రిక ఒక ప్రకటనలో తెలిపింది. సమకాలీన, చారిత్రక, సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో కథలు పంపాలని, భారతీయ సామాజిక జీవన నేపథ్యమే ఉండాలని పేర్కొంది. కథ 1500 పదాలకు మించరాదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.12వేలు, రూ.7వేలు, రూ.5వేలు. మరో ఆరు కథలకు ప్రోత్సాహక బహుమతిగా వెయ్య రూపాయల చొప్పున బహూకరిస్తారు.

07/30/2018 - 00:11

నిద్రరాని కళ్ళతో
వ్యథ నిండిన మనసుతో
నన్నొంటరిగా వదిలేసి
ఎన్ని రాత్రుళ్ళు గతించాయో!

కలలు ఎరుగని
కనురెప్పల పరదాలు
నిను కానక ఎన్ని
కన్నీటి మేఘాలయ్యాయో!

ఏ రోజు నువ్వు వస్తావోనని
ప్రతీరోజు దారంతా
కమలాలు పరచి
కరములు ఎంత కందాయో!

07/23/2018 - 02:42

వౌనం మంచిదే గాని
మాటలు లేకుంటే
దానికి విలువ లేదు.

గాలి మాట్లాడుతుంది
పువ్వు పరిమళమే భాష
పరిమళాన్ని మోసుకెళ్లేది పవనమే

అతడు కవి
వౌనంగా వున్నప్పుడు
చిరునవ్వే అతని భాష
ఇప్పుడు డొల్లగా కనిపిస్తున్నాడు
అప్పుడప్పుడు
వౌనం ముందు మాటలు సిగ్గుపడతాయ.

07/23/2018 - 02:40

యాజ్ఞసేని
(నవల)
రచన: బ్రహ్మశ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్య పండితుడు
వెల: రు.400/-
ప్రతులకు: నవోదయ- ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
*
బ్రహ్మశ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం పండితుడు లోగడ మహాభారత నామకోశమును రచించారు. ఇది చాలా సంక్లిష్ట కార్యము. దాదాపు పనె్నండు సంవత్సరములు శ్రమించినట్లు వారు చెప్పారు.

07/23/2018 - 02:38

ఏదో ఒక రాత్రివేళ నింగిలోకి తొంగిచూడండి
దిక్కులను వెలిగిస్తూ గగనమెక్కిన చుక్కల్లో
ధిక్కార దీపమై కనబడతాడు కవికోకిల.
శ్మశానాలు దాటి సమానత్వం సమాజాన్ని చేరనే లేదని
కాటిసీను కంటికి చూపిస్తూ అంతరంగస్థల పద్యమై
రాత్రింబవళ్ళు వినబడతాడు కవి దిగ్గజుడు.
కలాన్ని నిత్యం వెంటాడిన కులం
గుండెలోపల బాకుతో గుచ్చినప్పుడు
నిప్పురవ్వలు రాల్చి నిరసన స్వరమవుతాడు కవి

07/20/2018 - 21:42

పిడికెడు గాలిని
నాసిక పుటల్లో నింపుకోగానే
పేగులను కోసుకుంటూ
సంచిలో కూలబడింది
కొద్దికాలం తర్వాత
సంచి కూడా తెగిపోయంది

నదిని నిటారుగా నిలబెట్టి
దోసెడు నీళ్లను పిండుకొని
నోట్లో వేసుకున్నారు
కాసేపటికే నరాలగుండా
కాలువలు ప్రవహించి
ఎండిపోయి న బ్రతుకులు
చరిత్రకు చిహ్నమై నిలిచింది

07/20/2018 - 21:39

విత్తిన విత్తు మొలకెత్తనపుడు
మొలక పంటనివ్వనపుడు
రైతు కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

మీరిన వయసు రాని ఉద్యోగం
పనికి రాని పట్టాను చూసినపుడు
నిరుద్యోగి కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటి చుక్కా వేధించక!

కూటి కోసం కూలికెళితే
కొండంత రెడ్డి కొంగుపడితే
పసికూన కంట కనబడక
ఇగిరిపోవే కన్నీటిచుక్కా వేధించక!

07/20/2018 - 21:37

అక్షరాలను
పదాలలో నాటాను
విచిత్రం
నానీల పంట పండింది

అక్షరాలు ఏం
చేస్తాయ మిత్రమా
కవితా పంటను
పండిస్తాయ

నిత్యం అక్షరాలతో
పోరాటం అది
కవిత్వం పండేదాకా
ఆరాటం నాది

అక్షరాలతోనే
నా స్నేహం
కవితా పరిమళాలను
వెదజల్లడానికి

అక్షరం
నా ఊపిరి
కవిగా ఎదగడానికి
కవిత్వమై ఎగరడానికి

07/20/2018 - 21:36

రావిశాస్ర్తి లిటరరీ ట్రస్టు నిర్వహిస్తున్న వార్షిక పురస్కారం 2018 సంవత్సరానికి సుప్రసిద్ధ కథ, నవల, నాటక రచయత, విమర్శకులు కొలకలూరి ఇనాక్ ఎంపికైనట్లు ట్రస్టు ప్రతినిధి రాచకొండ ఉమాశంకర శాస్ర్తి ఒక ప్రకటనలో తెలిపారు. రావిశాస్ర్తి జయంతి సందర్భంగా జూలై 30వ తేదీన విశాఖపట్టణంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

07/16/2018 - 04:04

మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం
రచన: రావు కృష్ణారావు
పేజీలు: 152, వెల: రూ.120/-
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ - 520 004.
*
రెండు వర్గాల సిద్ధాంతం మార్క్సిజం. గతమంతా వర్గ పోరాటాల చరిత్ర అన్న నిర్వచనం చుట్టూ ఆ చైతన్యం పరచుకుని ఉంటుంది. మానవ మనుగడకు, రెండువర్గాల సిద్ధాంతానికి పొంతన కుదరదు.

Pages