S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/10/2018 - 22:02

ఉద్విగ్న కెరటాలు ఎగసే వేళ
అలలు రాస్తున్న లేఖ ఇది
సంద్రం ఒక నీలి కాగితం
మది వూహల మధురోహల
సమ్మోహన కావ్యం
నిశిరాత్రుల కడలి చెలియలి
కట్టతో చెలరేగిన తతంగం
అప్పుడే విచ్చిన చంద్రుడి పువ్వులోని
పుప్పొడి సిరాతో రాసిన లేఖ
అనుభవాల, భావాల ఏరువాక
ఆలోచనల తరంగాలు నింగిని
తాకుతూ, నీటి పాదముల చెంత
లేఖలు పరిచింది.

06/10/2018 - 22:00

ప్రతిరోజూ
ఓ సరికొత్త పేజీనే
క్షణానికో ప్రశ్నోదయం
అక్షరాల్లేని పుస్తకాల్లో
సమాధానాల కోసం వెతుకులాట
అనుభవాల కలం
అనుభూతుల గతాన్ని లిఖిస్తుంది
మార్కుల్లేవు కానీ
నిమిషానికో పరీక్ష
అలుపెరుగని నిత్య సాధన
అంతులేని సత్యశోధన
వర్తమానపు గొంతుతో
వల్లె వేస్తూనే వుండాలి
మానిన గాయాల అడుగుజాడల్ని
అతిక్రమిస్తే విరుగుతుంది

06/10/2018 - 21:58

కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సంయుక్త నిర్వహణలో సురేంద్ర దేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో...’ ఆవిష్కరణ జూన్ 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు యానాం, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో జరుగుతుందని కవిసంధ్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కవిసంధ్య సంపాదకులు డా. శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు.

06/10/2018 - 21:58

దారి పొడవునా అడుగుతూ వున్నా
పక్షుల్నీ, బోధి వృక్షాల్నీ, నక్షత్రాల్నీ
సమాధానం లేదు
దొరికినవన్నీ చదువుతూ వున్నా
కావ్యఖండాల్నీ, ప్రబంధాల్నీ, ఉద్గ్రంథాల్నీ
సందేహం తీరలేదు
ధ్యానంలో, అధ్యయనంలో, ప్రయాణంలో
తెలియలేదు ప్రేమంటే...
రెప్పపాటులో తెలిసింది
నన్ను చూసిన మరుక్షణమే
విప్పారిన నీ కనుపాపలను చూసినంత

06/10/2018 - 21:56

చిందర వందరగా పుస్తకాలు
తెరచుకొని కొన్ని, మూసికొని కొన్ని
అక్కడక్కడ దొంతరలుగా
మరికొన్ని ఒంటరిగా
రకరకాల పుస్తకాలు
తిరగేస్తూ కొందరు, వల్లెవేస్తూ ఇంకొందరు
ఎందరో రకరకాల వ్యక్తులు
వస్తున్నారు పోతున్నారు
ఏవేవో సమాలోచనలు, సమావేశాలు
జరుగుతున్నాయ
నడుం వాలుస్తూ కొందరు
పచార్లు చేస్తూ ఇంకొందరు
గంటలు గంటలు చర్చలు
వాదోపవాదాలు

06/03/2018 - 22:53

పరిమళం అందించే పుష్పం
పరిమళాన్ని ఆస్వాదించునా
అన్నం వార్చే కడవ
ఆకలి ఎరుగనా
సవ్వడితో తాళం వేసే మువ్వ
నాట్యం నాదనునా
మంచు బిందువులను
సేకరించే గాలులు
చలికి వణికి చతికిలపడునా
ఉప్పొంగే సముద్రపు కెరటాలు
దరి దారిని కాజేయునా
ఎండల్లో నీడనిచ్చే వృక్షం
సూర్యుని తాపం నాకేలననునా
జీవం పోసి జన్మనిచ్చే తల్లి

06/03/2018 - 22:50

జీవితం అనుక్షణం చెలరేగే భావాలతో
సముద్రపు ఓడలా ప్రయాణిస్తుంది
దారి నిండా అలుపెరుగని పోరాటాలతో
ఆత్మ సిద్ధాంతాలపై సవారి చేస్తుంది

ప్రతిసారీ కోల్పోతున్న స్వప్నాల్ని
మళ్ళీ మళ్లీ పునరుజ్జీవింపచేయడానికి
ఉఛ్వాస నిశ్వాసాల మధ్య హృదయ
రేఖలపై జ్ఞాపకాల పొరలను
ఏర్పాటు చేసుకుంటుంది

06/03/2018 - 22:48

ఆకాశం ఆనందబాష్పాలను రాల్చినప్పుడల్లా
రైతన్న గుండె పరశించిపోతూనే ఉంటుంది
ఆకాశం నీరే రైతన్న పంటకు పన్నీరు

రైతన్న వాన మొగుల్లను చూసినప్పుడల్లా
అక్కరకు రాని చుట్టం వానచినుకే అవుతుంది
నిత్యగాయంలా వాన కోసం ఎదురుచూపు

ప్రకృతిలో వానకాలం చిగురించినప్పుడల్లా
రైతన్న గుండె తండ్లాడుతూనే ఉంటుంది
జీవితాంతం వాన కోసమే రైతన్న బతుకు

06/03/2018 - 22:46

జీవితమంతా నటించాడు
ఇప్పుడట్లా కాదు.

తెల్లని వెంట్రుకలు అబద్ధం కాదు
శరీరంపై ముడుతలు అబద్ధం కాదు
తడబడే అడుగులు అబద్ధం కాదు
అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే
కన్నీటి తడి అబద్ధం కాదు
సంధ్యాకాలంలోని
రంగుల కలయకా
దాని క్షణక్షణాక్రీడా అబద్ధం కాదు

05/28/2018 - 01:01

మా పిల్లి - అబ్బో అది సాక్షాత్తు పులే
అదెప్పుడూ
ఒర వీరయోధుడు ఖడ్గాన్ని సానబట్టుకున్నట్టు
తన పంజాలను పదును పెట్టుకుంటూ వుంటుంది
చెట్టు తొర్ర దగ్గర తొండ కోసం చెవులు రిక్కించి
నిర్నిద్ర స్థితిలో మాటువేసినప్పటి దాని భంగిమ
నాసామిరంగ! పెద్దపులి తాతను తలపిస్తుంది

Pages