S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

09/06/2018 - 19:37

ఆధునిక తెలుగు నాటక రంగం సంఘ సంస్కరణ వాదంతో ప్రారంభమైంది. కందుకూరి, గురజాడ మొదలైన గొప్ప రచయితలు నాటక రంగానికి ఆధునిక సామాజిక దృక్పథాన్ని కలిగించారు. ఒక వంక చారిత్రక, పురాణ కథా వస్తువులతో సంప్రదాయ పద్ధతిలో నాటక రచన జరుగుతున్నా మరోవైపు సామాజిక దురాచారాలు, జాతీయోద్యమ సంఘటనలు, దేశభక్తి మొదలైన ఇతివృత్తాలతో సాంఘిక నాటకరంగం ముందడుగువేసింది.

09/04/2018 - 19:22

ఆపద ముంచుకొచ్చినపుడు అణాపైసలు లెక్కెయ్యదామె వాళ్లాయనలాగా. కూతురుకు జబ్బు చేస్తే పట్నం నుండి వచ్చిన కొడుకు కృష్ణమూర్తి డాక్టరును తెచ్చినా ప్రయోజనం కలగలేదు. కూతురు పోయిన దుఃఖం కంటే ‘‘ఏం చేస్తాం? ప్రారబ్దం’’ అనుకోవటమే ముఖ్యం ఆ ఇంటాయనకు!

09/03/2018 - 19:38

నార్లవారి నాటికలన్నీ ఒక సంపుటిగా ప్రచురించబడినాయి. కొత్తగడ్డ నార్లవారి పదహారు ఏకాంక నాటకాల సంపుటి. ద్వితీయ ముద్రణలో అది మార్పులకూ, చేర్పులకూ లోనయ్యింది. ప్రథమ ముద్రణలో వున్న జీవ జ్వాల అనే నాటికను తగ్గించి ఆశాపాశం అనే దానిని చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ పదహారు ఏకాంకిలలో కొత్తగడ్డ ఒకటి. అదే సంపుటికి కూడా పేరుగా నిలిచింది. ఇందులో ప్లాట్లు అప్పటికి అన్నీ కొత్తవే. అన్నీ కొత్త గడ్డలే!

08/31/2018 - 19:35

ఆరో రంగంలో దేశముఖ్ నల్లగొండ పారిపోవటం- అంతటితో దేశముఖ్ దౌర్జన్యకాండ అంతమైపోవడం ఫలప్రాప్తి.
ఈ నాటకంలో శిల్పం ఇంత కట్టుదిట్టంగా వుండటం చేతనే విశ్వనాథ సత్యనారాయణ గారు దీన్ని 10.7.1947న విజయవాడ శ్రీరామా టాకీస్‌లో చూసి ‘‘పాత్రపోషణ కమ్మచ్చున లాగినట్లున్నది. ఒక కావ్యానికి ఆద్యంతాలు ఇంత చక్కగా బిగించడం ఒక శిల్పపు నేర్పు’’ అని ప్రశంసించారు.

08/30/2018 - 19:46

నిషేధం తొలగించిన తర్వాత ఈ నాటకం మూడవ ముద్రణ సెప్టెంబరు 1957లో ప్రచురించబడింది. ఆ తరువాత 1962 ఆగస్టులో, 1972 మార్చిలో, 1980 సెప్టెంబరులో, 1996 జూన్‌లో పునర్ముద్రణలు పొందింది. ఈ నాటక ప్రదర్శన స్వర్ణోత్సవం 1996లో జరిగింది.

08/29/2018 - 18:50

ఆధునిక సాంఘిక నాటక రంగంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన మాభూమి నాటకాన్ని వాసిరెడ్డి-సుంకర అనే జంట రచయితలు రచించారు. వాసిరెడ్డి భాస్కరరావుగారిది తెలంగాణ సరిహద్దులోని నందిగామ తాలూకా, వీరుల పాడు గ్రామం. వీరు 1914 సెప్టెంబరు 2న జన్మించి, 1957 నవంబరు 1న 43వ ఏట మరణించారు. సుంకర సత్యనారాయణగారిది విజయవాడ దగ్గర ఈడుపుగల్లు గ్రామం. వీరు 1909 మార్చి 23న జన్మించారు.

08/28/2018 - 18:52

ప్రేమాభిమానాలు, గౌరవం, నమ్మకం, పారదర్శకత లేని తమ దంపతీబంధం నుంచి స్వతంత్రురాలవుతుంది ఎంతో ఆవేదనతో.

08/27/2018 - 19:08

ప్రేమమీద మతానిదీ పెత్తనమే. వీరశైవుల రాకుమారి నందినిని జైనుడైన ఉదయాదిత్యుడు ప్రేమించి- తన ప్రేమకోసం మతాన్ని వదులుకుని ఆమెను పెళ్లాడితే.. ఆమె సోదరులు మతవ్ఢ్యౌం అతనిని నరికి పోగులు పెట్టింది. తోడబుట్టిన చెల్లిలి ఆక్రందన కూడా వారిలో కారుణ్య భావనను కలిగించలేకపోయింది.

08/26/2018 - 21:46

1920ల నాటికే రాజమన్నారు ఏకాంకికలు వెలువడినా.. అవి రావలసినంత పరిగణనలోకి రాలేదని తెలుపుతూ దానికి గల కారణాలను విశే్లషించారు గోపాలస్వామి గారు.

08/24/2018 - 18:48

అసలే యుద్ధం రోజులు. ఆపై ఆర్థిక మాంద్యం
ఎటు చూసినా అనిశ్చితి. ఎవరిని కదిపినా అభద్రత
లలిత కళలు పల్లవించే ప్రభవించే వాతావరణం, అవకాశం ఉంటుందా?
సంగీత సాహిత్య వాచికాభినయాల సమ్మిళితమైన రంగస్థల వైభవం మసకబారకుండా ఉంటుందా?
ఇదీ రాజమన్నారు నాటికలకు తెరతీసే నాటి తెర వెనుక కథ

Pages