S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

10/14/2018 - 23:30

అతగాడు పాఠశాలకు పోవునపుడు జరిగే ఉత్సవాన్ని ఊళ్ళో అనేకమంది తీరుబడి చేసుకొని వచ్చి సంతోషిస్తారు. యజ్ఞ పశువును పడదోసినట్లు నలుగురు పిల్లలు అతణ్ణి కాళ్ళూ చేతులూ పట్టుకొని తీసుకువెళ్తుంటే పంతులుగారు బెత్తం ఝుళిపిస్తూ వెంట వెళ్తుంటారు.

10/12/2018 - 18:59

పిచ్చమ్మకు అనతికాలంలోనే కొడుకు పుడతాడు. గంగాధరుడని వాడికి పేరు పెట్టుకుంటారు. అయితే వాడి అచ్చటా ముచ్చటా పెద్దగా చూడకుండానే పాపయ్య మరిడి జాడ్యానికి గురై మృత్యువు పాలవుతాడు. నాలుగు రోజులపాటు వరుసగా శ్రాద్ధ్భోక్తగా వున్నందున, వార్థక్యంవల్ల ఈ జాడ్యం అతనికి సంక్రమిస్తుంది. అతనిని దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే అతని మామగారే ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు.

10/11/2018 - 19:35

సముద్రమంత విశాలమైన తెలుగు సాహిత్యంలో నిజానికి ఎందరు సాహితీమూర్తులు, వారు సృష్టించిన ఎన్ని అద్భుతమైన పాత్రలు లేవు? కాని చటుక్కున మన మనసులో మెదిలే పాత్రలు మాత్రం కొనే్న. గురజాడ వారి గిరీశం, పానుగంటి వారి జంఘాల శాస్ర్తీ, మొక్కపాటి వారి పార్వతీం.. ఇలా! అలాంటి పాత్రల కోవకు చెందినదే చిలకమర్తివారు సృష్టించిన గణపతి పాత్ర!

10/10/2018 - 18:55

1922లో దువ్వూరి రామిరెడ్డిగారై మాతృమందిరము అనే ఖండకావ్యంలో దేశాభివృద్ధికి, మాతృమందిరంలో స్థానానికి త్యాగం ప్రధానం అని వెంకట పార్వతీశ్వర కవులు తమ నవల మాతృమందిరంలో ప్రతిపాదించినట్లే ప్రతిపాదించారు.

10/09/2018 - 19:20

మాతృమందిరంలోని గోరక్షణ లాంటిదే 1935లో విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలులో గోచరిస్తుంది. అలాగే భోగం స్ర్తిల తొలినాటి గౌరవం గూర్చి రెండు నవలలు ప్రస్తావించాయి. జాషువా గారి గబ్బిలంలోని ప్రథమ పద్యంలాగానే ముత్యాలు జీవితం అభివర్ణింపబడింది.

10/08/2018 - 19:08

జొనాధన్ స్విప్ట్ రచించిన గలివర్స్ ట్రావెల్స్ అలాంటిది. స్విప్ట్‌లా కరకు మాటలతో కాకుండా, మంచి మాటలతో చేసిన ప్రయత్నం మన తెలుగు నవల మాతృమందిరం. మాతృమందిరం రుూజ్ ది తెలుగు యుటోపియా అని అనవచ్చు.

10/08/2018 - 01:45

మనం కూడా ఈ నవల చదివాక మాతృమందిరం లాంటి మందిరం ఎక్కడన్నా వుంటుందా అనుకుంటాం. అనుకుంటే అది చాలా సహజమైన సందేహం. ఉంటే బాగుండును గదా అని కూడా అనుకుంటాం. అది కూడా చాలా సహజమైన ఆకాంక్ష. కాని అలాంటి ప్రపంచం ఉంటే బాగుండును గదా అని మనకు అనిపింపజేయడంలోనే కవులు తాము సాధించవలసిన ప్రయోజనాన్ని సాధిస్తారు. ఈ విషయాన్ని కొంత వివరంగా చూద్దాం.

10/05/2018 - 19:41

ఆ క్షణంలోనే రంగడు, ముత్యాలు పెళ్లికి ప్రబోధానందస్వామి సన్నిధిలో సిద్ధమవుతారు. ముత్యాలు దగ్గరున్న పతకాన్నిచూసి, అది ఏనాడో పోయిన తన బిడ్డ గణపతి శాస్ర్తీ అని గౌరీపతి శాస్ర్తీ రుజువు చేస్తాడు. ఒక్కసారిగా రంగడు గణపతి శాస్ర్తీ అవుతాడు. కులాలు వేరుకావటంతో, మహోన్నత త్యాగంతో ముత్యాలు పరిణయబంధం త్యజిస్తుంది.

10/04/2018 - 19:10

రాజరత్నం అక్క నాగమణి. ఆమె సలహాతో భార్య అనసూయను అగౌరవం చేసి, గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లోంచి వెళ్లగొడతాడు వెంకటేశ్వరరావు. రాజమండ్రిలో గోపాలరావు నడిపే విలాస భవనంలో ఎందరో స్ర్తిలమధ్య జూదం ఆడుతూ వెంకటేశ్వరరావు యావదాస్తీ కోల్పోతాడు. తిండికి జరగదు. పశ్చాత్తాపం చెంది భార్యను వెతుక్కుంటూ వస్తాడు.

10/03/2018 - 19:49

కొడుకు పోవటం, కూతురు కాపురం ఇలా అయిందనే దిగులుతో అన్నపూర్ణ మరణిస్తుంది. శోకం తట్టుకోలేక తండ్రి కుమార్తెతో తీర్థయాత్రలు చేస్తూ, విజయవాడ కనకదుర్గాలయంలో ప్రవేశిస్తారు. అక్కడ సరస్వతికి తనభర్త సమీపంలోనే ఉన్నాడని మనసులో ఏదో తెలియని ప్రేరణ పొంది, తండ్రిని అక్కడే వదిలి, కృష్ణానది దగ్గరకు వెతుక్కుంటూ వచ్చి భర్త కనిపించక, దుఃఖంతో, కృష్ణలో పడుతుంది.

Pages